BIKKI NEWS : IOCL Apprentice Recruitment 2026. ప్రభుత్వ రంగ సంస్థలో అప్రెంటిస్‌షిప్ చేయాలనుకునే నిరుద్యోగ యువతకు మంచి అవకాశం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) పైప్‌లైన్స్ విభాగంలో దేశవ్యాప్తంగా వివిధ ట్రేడుల్లో మొత్తం 500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
IOCL Apprentice Recruitment 2026
టెక్నీషియన్ అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర విభాగాల్లో ఈ అవకాశాలు కల్పించనున్నారు.
పోస్టుల వివరాలు
ఈ అప్రెంటిస్ నియామకాల్లో ప్రధానంగా నాలుగు విభాగాల్లో అవకాశాలు ఉన్నాయి.
- టెక్నీషియన్ అప్రెంటిస్‌లు
- ట్రేడ్ అప్రెంటిస్‌లు
- డేటా ఎంట్రీ ఆపరేటర్ అప్రెంటిస్‌లు
- డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అప్రెంటిస్‌లు
విద్యార్హతలు
పోస్టును బట్టి విద్యార్హతలు నిర్ణయించారు.
| అప్రెంటిస్ విభాగం | విద్యార్హత |
|---|---|
| టెక్నీషియన్ (మెకానికల్) | సంబంధిత డిప్లొమా |
| టెక్నీషియన్ (ఎలక్ట్రికల్) | ఎలక్ట్రికల్ డిప్లొమా |
| టెక్నీషియన్ (టెలికమ్యూనికేషన్ & ఇన్‌స్ట్రుమెంటేషన్) | సంబంధిత ఇంజినీరింగ్ డిప్లొమా |
| అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్ | ఏదైనా డిగ్రీ |
| అకౌంటెంట్ | బీకామ్ డిగ్రీ |
| డేటా ఎంట్రీ ఆపరేటర్ | ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత |
| డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ | ఇంటర్‌తో పాటు సంబంధిత స్కిల్ సర్టిఫికెట్ |
వయోపరిమితి – రిజర్వేషన్
- కనీస వయస్సు: 18 సంవత్సరాలు
- గరిష్ఠ వయస్సు: 24 సంవత్సరాలు
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోసడలింపు.
- ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయోసడలింపు.
- దివ్యాంగ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.
IOCL Apprentice Recruitment 2026 – తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఖాళీలు
ఈ నియామకాలు దేశవ్యాప్తంగా ఐదు పైప్‌లైన్స్ ప్రాంతాల్లో చేపడుతున్నారు.
- తెలంగాణ: హైదరాబాద్‌లో 5 ఖాళీలు.
- ఆంధ్రప్రదేశ్: చిత్తూరు, అచ్యుతాపురం, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో ఖాళీలు ఉన్నాయి.
ఎంపిక విధానం
అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా ఎంపిక చేస్తారు. సంబంధిత విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు. అనంతరం ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
శిక్షణ కాలం
ఎంపికైన అభ్యర్థులకు 12 నెలల పాటు అప్రెంటిస్‌షిప్ శిక్షణ అందిస్తారు. అప్రెంటిస్ నిబంధనల ప్రకారం స్టైపెండ్ చెల్లిస్తారు. శిక్షణ పూర్తయినంత మాత్రాన సంస్థలో శాశ్వత ఉద్యోగం లభించినట్లు కాదు.
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తుల ప్రారంభ తేదీ: 06 నవంబర్ 2026
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05 డిసెంబర్ 2026
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
అర్హత కలిగిన అభ్యర్థులు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్‌ను పరిశీలించాలి. సూచించిన విధంగా రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి.
అధికారిక వెబ్‌సైట్: https://iocl.com/apprenticeships

