HCL Apprentice Recruitment 2026 – 10వ తరగతి, ఐటీఐ అర్హతతో అప్రెంటిషిప్

Hcl apprentice recruitment 2026

BIKKI NEWS : HCL Apprentice Recruitment 2026. ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (HCL) నుంచి భారీగా ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని మలంజ్‌ఖండ్ కాపర్ ప్రాజెక్టులో వివిధ ట్రేడ్లలో మొత్తం 171 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదో తరగతి, ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

HCL Apprentice Recruitment 2026

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ విడుదల చేసిన వివరాల ప్రకారం వివిధ ట్రేడ్లలో ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి.

ట్రేడ్ పేరుఖాళీలు
మేట్ మైన్స్ (ఫ్రెషర్)04
డ్రైవర్ కమ్ మెకానిక్06
ఫిట్టర్16
వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్)16
డ్రాఫ్ట్స్‌మన్ (మెకానికల్)03
సర్వేయర్03
బ్లాస్టింగ్ కన్సల్టెంట్02
హార్టికల్చర్ అసిస్టెంట్02
సోలార్ టెక్నీషియన్ (ఎలక్ట్రిషియన్)04
షాట్‌ఫైర్ / బ్లాస్టర్ (మైన్స్)13
డీజిల్ మెకానిక్10
టర్నర్ / మెషినిస్ట్16
ఎలక్ట్రీషియన్36
డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్)02
కంప్యూటర్ అసిస్టెంట్20
ఏసీ అండ్ రిఫ్రిజరేషన్ మెకానిక్02
కార్పెంటర్03
ప్లంబర్03
ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్10
మొత్తం171

విద్యార్హతలు

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పోస్టును బట్టి విద్యార్హతలు నిర్ణయించారు.

  • మేట్ మైన్స్, షాట్‌ఫైర్/బ్లాస్టర్, డ్రైవర్ కమ్ మెకానిక్ పోస్టులకు పదో తరగతి లేదా సమాన విద్యార్హత ఉండాలి.
  • మిగిలిన పోస్టులకు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత తప్పనిసరి.

వయోపరిమితి

దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

ఎంపిక విధానం

అభ్యర్థులను వారి విద్యార్హతల్లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీ

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 24, 2026.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అధికారిక వెబ్‌సైట్

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా పూర్తి నోటిఫికేషన్, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.

Official Website: https://www.hindustancopper.com/Home
Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →