BIKKI NEWS (FEB. 28) : Inter exams day 4 report. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) నిర్వహిస్తున్న వార్షిక పరీక్షల్లో భాగంగా శనివారం (ఫిబ్రవరి 28, 2026) జరిగిన సెకండియర్ ఇంగ్లీష్ పేపర్-II పరీక్ష విజయవంతంగా ముగిసింది. ఈ పరీక్షకు సంబంధించిన గణాంకాలను బోర్డు కార్యదర్శి ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఈరోజు జరిగిన పరీక్షకు బోర్డు “SET – C” ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసింది.
Inter exams day 4 report
బోర్డు విడుదల చేసిన వివరాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు సజావుగా సాగాయి. హాజరు వివరాలు కింది విధంగా ఉన్నాయి:
- మొత్తం రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు: 4,56,458
- పరీక్షకు హాజరైన వారు: 4,46,457
- గైర్హాజరైన వారు: 10,001
- హాజరు శాతం: 97.80%
ఇద్దరు విద్యార్థులపై వేటు
పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీ నిఘా ఏర్పాటు చేసినప్పటికీ, రెండు చోట్ల మాల్‌ప్రాక్టీస్ (కాపీయింగ్) కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో ఒకటి, సిద్దిపేట జిల్లాలో ఒక విద్యార్థిపై మాల్‌ప్రాక్టీస్ కేసులు బుక్ చేసినట్లు అధికారులు తెలిపారు.
పరీక్షా కేంద్రాల పరిశీలన
పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు బోర్డు ప్రత్యేక పరిశీలకులను (Observers) నియమించింది. వీరు కామారెడ్డి, కరీంనగర్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ మరియు యాదాద్రి జిల్లాల్లోని పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి నిరంతర పర్యవేక్షణ చేపట్టారు.

