IBPS PO Notification 2026 – బ్యాంకుల్లో 6715 పీఓ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Ibps 6715 po jobs notification

BIKKI NEWS (July 05) : IBPS PO notification 2026. బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) / మేనేజ్‌మెంట్ ట్రైనీ (MT) పోస్టుల భర్తీ కోసం CRP PO/MT-XVI నోటిఫికేషన్ 2026 విడుదల చేసింది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

IBPS PO notification 2026

ఖాళీల వివరాలు : మొత్తం 6715 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఈ నియామక ప్రక్రియ ద్వారా ఎంపికైన అభ్యర్థులు 2027-28 సంవత్సరానికి సంబంధించి వివిధ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో నియమించబడతారు.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం : జూలై 01, 2026
  • దరఖాస్తుకు చివరి తేదీ : జూలై 21, 2026
  • ప్రిలిమినరీ పరీక్ష : ఆగస్టు 2026
  • మెయిన్ పరీక్ష : అక్టోబర్ 2026
  • ఇంటర్వ్యూలు : నవంబర్ / డిసెంబర్ 2026
  • ప్రొవిజనల్ అలాట్‌మెంట్ : జనవరి 2027

పాల్గొనే బ్యాంకులు

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా క్రింది ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.

✓ బ్యాంక్ ఆఫ్ బరోడా
✓ బ్యాంక్ ఆఫ్ ఇండియా
✓ కెనరా బ్యాంక్
✓ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
✓ ఇండియన్ బ్యాంక్
✓ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
✓ పంజాబ్ నేషనల్ బ్యాంక్
✓ యూకో బ్యాంక్
✓ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర బ్యాంకులు.

విద్యార్హతలు

అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ (Graduation) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి (01-07-2026 నాటికి)

కనీస వయస్సు : 20 సంవత్సరాలు
గరిష్ట వయస్సు : 30 సంవత్సరాలు

రిజర్వేషన్ నిబంధనల ప్రకారం SC/ST/OBC/PwBD అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు

  • SC/ST/PwBD అభ్యర్థులు : ₹175/-
  • ఇతర అభ్యర్థులు : ₹850/-

ఎంపిక విధానం

అభ్యర్థుల ఎంపిక క్రింది దశల ద్వారా జరుగుతుంది.

  1. ప్రిలిమినరీ పరీక్ష
  2. మెయిన్ పరీక్ష
  3. పర్సనాలిటీ టెస్ట్
  4. ఇంటర్వ్యూ
  5. డాక్యుమెంట్ వెరిఫికేషన్

ప్రిలిమ్స్ పరీక్ష విధానం

మొత్తం ప్రశ్నలు : 100
మార్కులు : 100
సమయం : 60 నిమిషాలు

సబ్జెక్టులు :

✓ ఇంగ్లీష్ లాంగ్వేజ్
✓ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
✓ రీజనింగ్ ఎబిలిటీ

జీతం వివరాలు

ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ బేసిక్ పే ₹48,480/- తో పాటు బ్యాంకు నిబంధనల ప్రకారం అలవెన్సులు అందుతాయి.

ఎలా దరఖాస్తు చేయాలి?

అర్హత కలిగిన అభ్యర్థులు IBPS అధికారిక వెబ్‌సైట్ ద్వారా జూలై 21, 2026 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

పూర్తి నోటిఫికేషన్ : Download PDF

దరఖాస్తు లింక్ : Apply here

వెబ్సైట్ : https://www.ibps.in/index.php/crp-updates/

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →