Floods – సిరిసిల్లలో వ్యక్తి గల్లంతు, కామారెడ్డిలో పలు రైళ్లు రద్దు

BIKKI NEWS (AUG. 27) : HEAVY FLOODS IN KAMAREDDY and SIRICILLA DISTRICTS. సిరసిల్ల జిల్లాలోని గంభీరావుపేటలో భారీ వర్షం కారణంగా ఎగువ మానేరున నుంచి దిగువకు నీరు విడుదల చేశారు. దీంతో మానేరు వాగులో పశువుల కాపరి నాగయ్య గల్లంతైనట్లు సమాచారం. గల్లంతైన నాగయ్య కోసం కొనసాగుతున్న గాలింపు చెపట్టారు.

HEAVY FLOODS IN KAMAREDDY and SIRICILLA DISTRICTS

అలాగే మానేరు వాగులో చిక్కుకున్న మరో ఐదుగురు రైతులు. రైతులను రక్షించేందుకు అధికారుల తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

మరోవైపు కామారెడ్డి జిల్లాలో భారీవర్షాలకు దెబ్బతిన్న రైల్వే ట్రాక్. తలమట్ల దగ్గర రైలు పట్టాల పైనుంచి వరద ప్రవాహం. దీంతో 12 రైళ్ల రాకపోకలకు అంతరాయం. నాలుగు రైళ్లను దారి మళ్లించిన అధికారులు. ట్రాక్‌ పునరుద్ధరణ పనులు చేపట్టిన రైల్వే సిబ్బంది.