BIKKI NEWS : GST month wise collection 2026. దేశంలో వస్తు సేవల పన్ను (GST) వసూళ్లు భారీగా పెరిగాయి. 2026 అక్టోబర్ నెలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి మొత్తం రూ.2,31,290 కోట్ల స్థూల GST ఆదాయం సమకూరింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 23 శాతం వృద్ధి నమోదైంది.
పండుగల సీజన్‌లో పెరిగిన కొనుగోళ్లు, దేశీయ వ్యాపార కార్యకలాపాలు, దిగుమతుల కారణంగా GST వసూళ్లు గణనీయంగా పెరిగాయి.
అక్టోబర్ 2026 GST వసూళ్ల వివరాలు
| పన్ను విభాగం | వసూళ్లు |
|---|---|
| CGST | రూ.42,935 కోట్లు |
| SGST | రూ.51,340 కోట్లు |
| IGST | రూ.1,37,015 కోట్లు |
| మొత్తం | రూ.2,31,290 కోట్లు |
GST month wise collection 2026
2026 సంవత్సరంలో ఇప్పటివరకు నమోదైన నెలవారీ GST వసూళ్ల వివరాలు కింద పట్టికలో చూడవచ్చు.
| నెల | GST వసూళ్లు (రూ. కోట్లలో) |
|---|---|
| జనవరి | 1,93,384 |
| ఫిబ్రవరి | 1,83,609 |
| మార్చి | 2,00,063 |
| ఏప్రిల్ | 2,42,702 |
| మే | 1,94,184 |
| జూన్ | 1,94,812 |
| జూలై | 2,11,205 |
| ఆగస్టు | 1,99,853 |
| సెప్టెంబర్ | 2,03,521 |
| అక్టోబర్ | 2,31,290 |
| మొత్తం | 20,54,623 |
ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు GST ఆదాయం
2026-27 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మొత్తం స్థూల GST వసూళ్లు రూ.14.77 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 13.2 శాతం వృద్ధి నమోదైంది.

