GTOUP 1 – గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు రద్దు : హైకోర్టు

BIKKI NEWS (SEP. 09) : Group 1 mains result cancelled by high court. తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఫలితాలు రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

Group 1 mains result cancelled by high court.

టీజీపీఎస్సీ గతంలో ప్రకటించిన మెయిన్స్ ఫలితాలను రద్దు చేసింది.

మెయిన్స్ పేపర్లను మళ్లీ మూల్యాంకనం చేయాలని, దాని ఆధారంగానే ఫలితాలు వెలువరించాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ఆదేశించింది.

అది సాధ్యం కాకపోతే మళ్లీ మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని తెలిపింది.

కాగా మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ కొందరు అభ్యర్థులు గతంలో హైకోర్టు లో పిటిషన్లు వేశారు. విచారణ సందర్భంగా ధర్మాసనం పైవిధంగా వ్యాఖ్యానించింది.