GROUP 1 అభ్యర్థులకు 27న నియామక పత్రాలు

BIKKI NEWS (SEP. 25) : Group 1 Appointment orders on 27th September. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-I పరీక్షల ద్వారా ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబర్ 27న, శనివారం సాయంత్రం శిల్పకళా వేదికలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు నియామక పత్రాలు అందజేయనున్నారు.

Group 1 Appointment orders on 27th September.

తాజాగా హైకోర్టు ఆదేశాలతో 562 మందితో కూడిన తుది ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. న్యాయవివాదాల కారణంగా ఒక అభ్యర్థి ఫలితాలను విత్ హెల్డ్ లో ఉంచారు.