గోదావరిఖని బాలికల కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే.

BIKKI NEWS (SEP. 24) : Freshers day celebration in GJC Girls Godavarikhani. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల శారదా నగర్ గోదావరిఖని లో ఫ్రెషర్స్ డే కార్యక్రమం ఘనంగా జరిగింది.

Freshers day celebration in GJC Girls Godavarikhani

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ మరియు రామగుండం మున్సిపల్ కమీషనర్ శ్రీమతి అరుణ శ్రీ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు .

విద్యార్ధినులు క్రమశిక్షణ కలిగి ఉన్నత లక్ష్యాలతో, సామాజిక స్పహ తో ఉన్నతంగా ఎదిగి తమకు, కుటుంబానికి, సమాజానికి గుర్తింపు తెగలిగే సామార్థ్యలను పెంచుకోవాలని సూచించారు. తద్వారా కళాశాల కు మంచి పేరు తేవాలని, ఉన్నత ఆశయాల వైపు వెళ్లాలని కోరారు.

ప్రిన్సిపాల్ మరియు జిల్లా ఇంటర్మీడియట్ అధికారిని శ్రీమతి డి. కల్పన మాట్లాడుతూ కళాశాలలో ఉన్న అందరు విద్యార్థులు పూర్తి స్థాయిలో అభ్యసించి, విషయ పరిజ్ఞానం పొంది, మెలకువలు నేర్చుకొని, మంచి ఉత్తీర్ణత సాధించాలని, అందరు ఐకమత్యం తో ఉంటూ కళాశాలలో జరిగే అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని, ప్రతి రోజు కళాశాలకు క్రమం తప్పకుండ రావాలని, తద్వారా ఉన్నతంగా ఎదగాలని సూచించారు.

అనంతరం విద్యార్ధినుల చేత ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. అనంతరం జాతీయ సేవా పథకం దినోత్సవం సందర్బంగా స్వామి వివేకానంద చిత్ర పటానికి పూల మాలను అలంకరణ చేసి కార్యక్రమం విజయవంతం చేశారు.

ఈ కార్యక్రమం లో ఇంచార్జి ప్రిన్సిపాల్ రాజేందర్, మరియు NSS ప్రోగ్రాం ఆఫీసర్ శంకర్ మరియు కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్ధినులు పాల్గొని ఫ్రెషర్స్ డే ను విజయవంతం చేశారు.