FREE TRAINING : నిరుద్యోగులకు ఉచిత వసతి తో శిక్షణ

BIKKI NEWS (AUG 22) : free training for unemployed youth by Swami Ramananda teirtha institute . తెలంగాణ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో తెలంగాణ నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత వసతి భోజనం తో కూడిన శిక్షణ అందించడానికి ప్రకటన విడుదల చేశారు.

free training for unemployed youth by Swami Ramananda teirtha institute

కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత పథకమైన దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం కింద ఈ ఉచిత ఉపాధి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.

శిక్షణ కోర్సులు

1) ఈ అకౌంట్స్ అసిస్టెంట్ (ట్యాలీ) – మూడున్నర నెలల ఈ శిక్షణకు బీకాం పాసైన వారు అర్హులు

2) కంప్యూటర్ హార్డ్
వేర్ అసిస్టెంట్ – మూడున్నర నెలల ఈ శిక్షణకు ఇంటర్మీడియట్ పాసైన వారు అర్హులు

3) ఆటోమొబైల్ టు వీలర్ సర్వీసింగ్ – మూడున్నర నెలల ఈ శిక్షణకు పదో తరగతి పాసైన వారు అర్హులు

4) సోలార్ సిస్టం ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్ – మూడున్నర నెలల ఈ శిక్షణకు పదో తరగతి /ఐటీఐ పాసైన వారు అర్హులు

అర్హతలు : గ్రామీణ అభ్యర్థులై ఉండాలి. వయసు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. (ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు అర్హులు కాదు.)

కావలసిన ధ్రువపత్రాలు : విద్యకు సంబంధించిన సర్టిఫికెట్లు ఒరిజినల్ మరియు ఒక సెట్ జిరాక్స్, ఆధార్ కార్డు మీ, పాస్పోర్ట్ సైజు ఫోటో, రేషన్ కార్డు.

చిరునామా : స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, జలాల్పూర్ గ్రామం, పోచంపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా.

దరఖాస్తుకు చివరి తేదీ : సెప్టెంబర్ – 01 – 2025