FREE TRAINING – గ్రామీణ యువతకు ఉచిత శిక్షణ, ఉపాధి

BIKKI NEWS (AUG. 30) : Free training for rural unemployed youth in Telangana. తెలంగాణ గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ – తెలంగాణ ప్రభుత్వ పరిపాలనలో, స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో ఉచిత అవుట్‌కమ్ ఆధారిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.

Free training for rural unemployed youth in Telangana

ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా దీన్‌దయాల ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన (DDUGKY) ఆధ్వర్యంలో నిర్వహించనుండగా, గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువతులకు డాటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులో (డిజిటల్ మిత్ర) మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు.

శిక్షణ పూర్తిచేసిన అభ్యర్థులకు ఇండస్ట్రీ మీడియేషన్ లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు

అర్హతలు: వయస్సు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.
గ్రామీణ ప్రాంతానికి చెందినవారై ఉండాలి.
ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులయ్యి ఉండాలి.

ఎంపిక విధానం : అభ్యర్థులు ఆధార్, పదవ, ఇంటర్ తరగతి సర్టిఫికెట్, బ్యాంకు పాస్‌బుక్, రేషన్ కార్డు, నాలుగు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ కార్యాలయాన్ని సంప్రదించాలి

పూర్తి వివరాలు:
చిరునామా: స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, జలాల్‌పూర్ (గ్రా), భువనగిరి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ-508 284

దరఖాస్తు చివరి తేది: 08.09.2025 (సోమవారం)

మరిన్ని వివరాలకు: 9133908000, 9133908111, 9133908222, 9948466111