EPFO Systematic Withdrawal Plan – ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత నెలనెలా ఆదాయం

Epfo systematic withdrawal plan

BIKKI NEWS : EPFO Systematic Withdrawal Plan. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) పరిధిలోకి వచ్చే కోట్లాది మంది కార్మికులు, ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పదవీ విరమణ (రిటైర్మెంట్) తర్వాత తమ పీఎఫ్ ఖాతాలోని మొత్తాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకోకుండా, నిర్ణీత కాలవ్యవధిలో విడతలవారీగా తీసుకునేందుకు వీలుగా ‘సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (SWP)’ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

EPFO Systematic Withdrawal Plan

గురువారం ఢిల్లీలో కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన ఈపీఎఫ్‌ఓ 240వ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో ఈ మేరకు కీలక ఆమోదం లభించింది. దీనితో పాటు భవిష్యనిధి కనీస నిల్వ (మినిమమ్ బ్యాలెన్స్), ఉపసంహరణ వేచి ఉండే కాలంలోనూ భారీ మార్పులు చేశారు.

సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (SWP) ప్రయోజనాలు & ముఖ్య అంశాలు

  • విడతలవారీగా ఆదాయం: ఈ పథకం కింద పదవీ విరమణ నాటికి ఖాతాలో జమ అయిన మొత్తాన్ని ఒకేసారి కాకుండా ప్రతి నెల, 3 నెలలు లేదా 6 నెలలకోసారి విడతలవారీగా వెనక్కి తీసుకోవచ్చు.
  • పింఛనుకు అదనపు ఆదాయం: నెలవారీ వచ్చే సాధారణ ఈపీఎస్ పింఛనుకు (EPS Pension) అదనంగా ఈ విధానం ద్వారా ఉద్యోగులకు క్రమబద్ధమైన పదవీ విరమణ ఆదాయం లభిస్తుంది. మిగిలిన నిధిపై వడ్డీ రాబడి కూడా కొనసాగుతుంది.
  • స్వచ్ఛంద పథకం (Optional): ఎస్‌డబ్ల్యూపీ పూర్తిగా స్వచ్ఛందం మాత్రమే తప్పనిసరి కాదు. సభ్యులు తమ ఇష్టానుసారం ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు.
  • పూర్తి యాజమాన్య హక్కు: పదవీ విరమణ నిల్వలను ‘ఎస్‌డబ్ల్యూపీ’లోకి మార్చినప్పటికీ, ఆ మొత్తంపై చందాదారులకే పూర్తి యాజమాన్య హక్కు ఉంటుంది.
  • తొలిదశ లబ్ధిదారులు: ప్రస్తుతం 55 ఏళ్లు పైబడి, ఖాతాలో రూ. 5 లక్షలకు పైగా నిల్వ ఉన్న చందాదారులు దేశవ్యాప్తంగా దాదాపు 6.32 లక్షల మంది ఉన్నారు. వీరంతా తొలిదశలో ప్రాథమిక లబ్ధిదారులుగా ఉంటారని అంచనా వేస్తున్నారు.
  • కుటుంబానికి ఆర్థిక భద్రత: ఒకవేళ పదవీ విరమణ అనంతరం చెల్లింపులు పొందుతూ చందాదారుడు మరణిస్తే, ఖాతాలోని నామినీ లేదా ఆ వ్యక్తిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు మిగిలిన నిధి మొత్తాన్ని ఒకేసారి వెనక్కి తీసుకోవచ్చు లేదా ఈ పథకం కింద చెల్లింపులను కొనసాగించవచ్చు.

Also read : CPS to OPS మారే. ఉద్యోగులకు మార్గదర్శకాలు

EPFO Systematic Withdrawal Plan- సీబీటీ సమావేశంలో తీసుకున్న ఇతర కీలక నిర్ణయాలు
అంశంపాత నిబంధనకొత్త నిబంధన (ఆమోదించినవి)
భవిష్యనిధి కనీస నిల్వ (Minimum Balance)ఖాతాలో కనీసం 25 శాతం నిల్వ ఉంచాల్సి ఉండేది.కనీస నిల్వ పరిమితిని 10 శాతానికి తగ్గించారు.
ఉపసంహరణ వేచి ఉండే కాలం (Waiting Period)పూర్తి విత్‌డ్రాయల్ కోసం 12 నెలలు వేచి ఉండాల్సి వచ్చేది.వేచి ఉండే కాలాన్ని 12 నెలల నుంచి 2 నెలలకు కుదించారు.
కనీస పింఛను పెంపు (Minimum Pension)ప్రస్తుతం రూ. 1,000 కనీస పెన్షన్ అమలులో ఉంది.సీబీటీ సభ్యులు పెంపు అంశాన్ని లేవనెత్తగా, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.
  • వీటితో పాటు గిగ్ (Gig), ప్లాట్‌ఫాం వర్కర్లకు సామాజిక భద్రత కల్పించేందుకు వీలు కల్పించారు.
  • 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ఓ సవరించిన అంచనాలు, 2027-28 బడ్జెట్ అంచనాలకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో కార్మికశాఖ కార్యదర్శి డాక్టర్ చంద్రభూషణ్ కుమార్, సీపీఎఫ్‌సీ రమేష్ కృష్ణమూర్తి మరియు కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →