PENDING BILLS – ఉద్యోగుల పెండింగ్ బిల్లులు విడుదల

BIKKI NEWS (AUG. 30) : Employees pending bills released in telangana.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయ, కార్మిక మరియు పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటికి (TGEJAC) ఇచ్చిన హామీ మేరకు పెండింగ్ బిల్లులను విడుదల చేసినట్లు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాస్ రావులు తెలిపారు.

Employees pending bills released in telangana.

నేటివరకు బకాయి ఉన్న 392 కోట్ల రూపాయల జీతాల సప్లీమెంటరీ బిల్లులు మరియు సెప్టెంబర్ 2024 వరకు బకాయిలుగా ఉన్న 308 కోట్ల రూపాయల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) బిల్లులకు ఆగస్టు నెల వరకు ఈరోజు చెల్లింపులు జరిపినట్లు వారు ఒక ప్రకటనలో తెలిపారు.

మిగతా పెండింగ్ డిమాండ్లను అన్నింటిని కూడా ఇదే విధంగా పరిష్కరించాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.