EKALVYA GURUKULA JOBS – ఏకలవ్య గురుకులాల్లో జాబ్స్

BIKKI NEWS (SEP. 07) : EKALVYA GURUKULA JOBS NOTIFICATION 2025. గిరిజన సంక్షేమ ఏకలవ్య గురుకుల విద్యాలయాల సంస్థ మహబూబాబాద్ జిల్లాలోని విద్యాసంస్థలో ఔట్ సోర్సింగ్ పద్దతిలో ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేసింది.

EKALVYA GURUKULA JOBS NOTIFICATION 2025.

పోస్టుల వివరాలు & అర్హతలు :

1) హాస్టల్ వార్డెన్ (పురుష) : 01

అర్హతలు : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ సంస్థ నుండి ఏదైనా బ్యాచిలర్ డిగ్రి (3 లేదా 4) సంవత్సరాలు

2) హాస్టల్ వార్డెన్ : 02 (మహిళ)

అర్హతలు : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ సంస్థ నుండి ఏదైనా బ్యాచిలర్ డిగ్రి (3 లేదా 4) సంవత్సరాలు

3) అకౌంటెంట్ : 01

అర్హతలు : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ సంస్థ నుండి వాణిజ్య డిగ్రీ (కామర్స్)

4) కౌన్సిలర్ : 04

అర్హతలు : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ సంస్థ నుండి సైకాలజీ/ క్లినికల్ సైకాలజిలో మాస్టర్స్ డిగ్రీ

5) కేటరింగ్ అసిస్టెంట్ : 01

అర్హతలు : భారత ప్రభుత్వం/ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక మంత్రిత్వ శాఖ గుర్తించిన సంస్థ నుండి కేటరింగ్లో 03 సంవత్సరాల డిగ్రీ కోర్సు లేదా తత్సమానం లేదా రెగ్యులర్ ఎస్టాబ్లిష్మెంట్లోని డిఫెన్స్ సర్వీసెస్లో కనీసం 10 సంవత్సరాల సేవతో కేటరింగ్లో ట్రేడ్ ప్రావీణ్యత సర్టిఫికేట్ (మాజీ సైనికులకు మాత్రమే)

6) ఎలక్ట్రిషియన్ కమ్ ప్లంబర్ : 03

అర్హతలు : గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుండి 10వ తరగతిలో ఉత్తీర్ణత 2. ఐ.టి.ఐ సర్టిఫికేట్ లేదా పాలిటెక్నిక్ సర్టిఫికేట్ లేదా ఎలక్ట్రిషియన్ లేదా వైర్మెన్ ట్రేడ్లో ఉన్నత డిగ్రీ

7) ల్యాబ్ అటెండెంట్ : 01

అర్హతలు : గుర్తింపు పొందిన బోర్డు/ సంస్థ నుండి ల్యాబరేటరీ టెక్నిక్ సర్టిఫికేట్/డిప్లొమాతో పాటు 10వ తరగతి లేదా గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటి నుండి సైన్స్ స్ట్రీమ్తో 12వ తరగతి.

8) మెస్ హెల్పర్ : 02

అర్హతలు : గుర్తింపు పొందిన బోర్డు/ సంస్థ నుండి 10వ తరగతి ఉత్తీర్ణత.

ఆసక్తి అర్హత గల అభ్యర్థులు వారి యొక్క దరఖాస్తులు/ బయోడేటాతో పాటు అర్హత దృవీకరణ ప్రతులు (జిరాక్స్ ప్రతులు) నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు

దరఖాస్తు గడువు : 06.09.2025 నుండి 15.09.2025 సాయంత్రం 04.00 గంటలలోపు ప్రాంతీయ సమన్వయ అధికారి కార్యాలయం మహబూబాబాద్ నందు సమర్పించవచ్చు.