BIKKI NEWS : Daily GK Bits part 153 – జనరల్ నాలెడ్జ్ బిట్స్
Daily GK Bits part 153
1) భూ ఉపరితలం నుండి భూస్థావర ఉపగ్రహం ఉండే ఎత్తు ఎంత.?
జ : 36,000 కీ.మీ.
2) భూ కేంద్రం నుండి భూస్థావర ఉపగ్రహం ఉండే ఎత్తు ఎంత.?
జ : 42,400 కీ.మీ.
3) వాహనాలు ప్రయాణించిన దూరాన్ని కొలవడానికి ఉపయోగించే మీటర్ ఏమిటి?
జ : ఓడోమీటర్
4) వస్తువు స్థానభ్రంశంలో కలిగే మార్పు రేటును ఏమంటారు.?
జ : వేగం
5) భూమిపై వేగంగా పరిగెత్తే జంతువు చిరుత పులి దాని వేగం ఎంత.?
జ : గంటకు 97 కి.మీ
6) వస్తువుపై పనిచేసే భూమ్యాకర్షణ బలాన్ని ఏమంటారు.?
జ : భారం
7) కేంద్రక సిద్ధాంతాన్ని రెండవ శతాబ్దంలో ఎవరు ప్రతిపాదించారు.?
జ : టాలేమి
8) ఏ కుట్ర కేసులో భాగంగా భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లకు మరణశిక్ష విధించారు.?
జ : లాహోర్ కుట్ర కేసు
9) లాలా లజపతిరాయ్ పై లాఠీ ఛార్జ్ చేసి ఆయన మరణానికి కారణమైన అధికారి ఎవరు.?
జ : సాండర్స్
10) గదర్ ఉద్యమం ఏ నగరం కేంద్రం గా సాగింది.?
జ : శాన్‌ప్రాన్సిస్కో (అమెరికా )
11) గదర్ పార్టీ మార్గదర్శకుడు ఎవరు.?
జ : లాలా హరదయాళ్
12) గామా కిరణాలకు విద్యుదావేశం మరియు ద్రవ్యరాశి ఎలా ఉంటుంది.?
జ : శూన్యం
13) ద్రవ్యరాశి శక్తి తుల్యతా నియమం ను ఎవరు ప్రతిపాదించారు.?
జ : ఐన్‌స్టీన్
14) ఐన్‌స్టీన్ కు 1921 లో నోబెల్ బహుమతి ఏ పరిశోధనకు గానూ అందజేశారు.?
జ : కాంతి విద్యుత్ ఫలితం
15) అత్యుత్తమ అణు ఇంధనం గా పరిగణించే మూలకం ఏది.?
జ : ప్లూటోనియం
16) సహజ రేడియోధార్మికతను ఎవరు కనుగొన్నారు.?
జ : హెన్రీ బెకరల్
17) ఏ పరమాణు సంఖ్య కంటేఎక్కువ కలిగిన మూలకాలలో సహజ రేడియో ధార్మికత ఎక్కువగా కనిపిస్తుంది.?
జ : 82
18) కేంద్ర బడ్జెట్ ను తయారు చేసి పార్లమెంట్ కు సమర్పించే భాధ్యత ఏ శాఖది.?
జ : ఆర్థిక శాఖ
19) తెలంగాణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన తేదీ ఏది.?
జ : ఫిబ్రవరి 18 – 2014
20) తెలంగాణ బిల్లు రాజ్యసభ లో ఆమోదం పొందిన తేదీ ఏది.?
జ : ఫిబ్రవరి 20 – 2014
21) తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసిన తేదీ ఏది.?
జ : మార్చి 01 – 2014
22) తెలంగాణ బిల్లుపై కేంద్రం ఏరోజు గెజిట్ విడుదల చేసింది.?
జ : మార్చి 02 – 2014
23) మా భూమి నాటకంలో ఎవరి వీరత్వం గురించి వివరించారు.?
జ : షేక్ బందగీ
24) శ్రీకృష్ణ కమిటీ ఎప్పుడు తన నివేదికను కేంద్రానికి సమర్పించింది.?
జ : 2010 డిసెంబర్ 30
25) కేంద్రం ఎప్పుడు శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది.?
జ : 2010 ఫిబ్రవరి 03
26) చిన్న పేగు ప్రాథమిక విధి ఏమిటి.?
జ : ఆహారం నుంచి పోషకాలను గ్రహించడం
27) కొవ్వులను కొవ్వు ఆమ్లాలు, గ్లిజరాలుగా విచ్చినం చేసే హార్మోన్ ఏది.?
జ : లైఫేజ్
28) ఇందిరా పాయింట్ ప్రత్యేకత ఏమిటి.?
జ : భారతదేశ దక్షిణ కొన
29) అంతర్వేది అంటే అర్దం ఏమిటి.?
జ : రెండు నదుల మధ్య ఉన్న ప్రాంతం
30) భారత దేశ ప్రామాణిక రేఖ ఏది.?
జ : 82.1/2 తూర్పు రేఖాంశం
