BIKKI NEWS : Daily GK BITS -15 for compititive exams. పోటీ పరీక్షల కొరకు జీకే బిట్స్.
DAILY GK BITS – 15
1) “ఫోటోసింథసిస్” ప్రక్రియలో విడుదల అయ్యే వాయువు ఏది?జ : ఆక్సిజన్.
2) కాంతి ఒక మధ్యమం నుండి మరొక మధ్యమంలోకి వెళ్ళినప్పుడు వంగడాన్ని ఏమంటారు?
జ : వక్రీభవనం (Refraction).
3) “DNA” పూర్తి రూపం ఏమిటి?
జ : Deoxyribo Nucleic Acid.
4) సౌర కుటుంబంలో అతిపెద్ద ఉపగ్రహం ఏది?
జ : గనిమీడ్ (జూపిటర్ ఉపగ్రహం).
5) “టైఫాయిడ్” వ్యాధిని కలిగించే సూక్ష్మక్రిమి ఏది?
జ : సాల్మోనెల్లా టైఫి.
6) “తంజావూరు బ్రహదీశ్వరాలయం”ను ఎవరు నిర్మించారు?
జ : రాజరాజ చోళుడు.
7) “సైమన్ కమిషన్” ఎప్పుడు భారతదేశానికి వచ్చింది?
జ : 1928 లో.
8) “జల్లియన్‌వాలా బాగ్ హత్యాకాండ” ఏ సంవత్సరంలో జరిగింది?
జ : 1919 లో.
9) “వేదాలు” ఏ భాషలో రాయబడ్డాయి?
జ : సంస్కృతంలో.
10) “కాకతీయుల రాజధాని” ఏది?
జ : ఓరుగల్లు (వరంగల్).
11) “భారత రాజ్యాంగం” ఆమోదం పొందిన తేదీ ఏది?
జ : 1949 నవంబర్ 26.
12) “భారతదేశపు ఉపరాష్ట్రపతి” పదవీ కాలం ఎంత?
జ : 5 సంవత్సరాలు.
13) రాజ్యాంగంలో “ఒకే పౌరసత్వం” ఏ ఆర్టికల్ కింద ఉంది?
జ : ఆర్టికల్ 5–11.
14) “లోక్‌సభ స్పీకర్” ను ఎవరు ఎన్నుకుంటారు?
జ : లోక్‌సభ సభ్యులు.
15) “అత్యవసర పరిస్థితి” మొత్తం ఎన్ని రకాలుగా ప్రకటించవచ్చు?
జ : మూడు రకాలుగా.
16) భారతదేశపు మొదటి ఆర్థిక మంత్రి ఎవరు?
జ : ఆర్.కే. శణ్ముఖం చెట్టి.
17) “రాజ్య ఆర్థిక సంఘం” ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నియమించబడుతుంది?
జ : ప్రతి 5 సంవత్సరాలకు.
18) “మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం” ఎప్పుడు అమలులోకి వచ్చింది?
జ : 2006 లో.
19) “నోట్ జారీ అధికారం” ఎవరి దగ్గర ఉంది?
జ : భారతీయ రిజర్వు బ్యాంక్ (RBI).
20) “భారతీయ ఆర్థిక సర్వే”ను ఎవరు విడుదల చేస్తారు?
జ : కేంద్ర ఆర్థిక మంత్రి.
21) ఒక వస్తువు ధర రూ. 1500. 10% తగ్గింపు ఇచ్చారు. అమ్మకపు ధర ఎంత?
జ : రూ. 1350.
22) 12 × 15 = ?
జ : 180.
23) A ఒక పనిని 10 రోజుల్లో పూర్తిచేస్తాడు, B 15 రోజుల్లో పూర్తిచేస్తాడు. ఇద్దరూ కలిసి చేస్తే పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది?
జ : 6 రోజులు.
24) ఒక సంఖ్యను 9తో భాగిస్తే శేషం 7 వస్తుంది. అదే సంఖ్యను 3తో భాగిస్తే శేషం ఎంత వస్తుంది?
జ: 1.
25) ఒక రైలు 72 km/hr వేగంతో వెళ్తుంది. 10 సెకన్లలో అది ఎంత దూరం ప్రయాణిస్తుంది?
జ : 200 మీటర్లు.
26) భూమి భ్రమణానికి పట్టే సమయం ఎంత?
జ: 23 గంటలు 56 నిమిషాలు.
27) ప్రపంచంలో అతిపెద్ద నది ఏది?
జ : నైల్ నది.
28) “అరావళి పర్వత శ్రేణి” ఏ రాష్ట్రంలో ఉంది?
జ :రాజస్థాన్.
29) “మౌంట్ ఎవరెస్ట్” ఎక్కడ ఉంది?
జ : నేపాల్–చైనా సరిహద్దులో.
30) భారతదేశంలో అత్యధిక వర్షపాతం పడే ప్రదేశం ఏది.?
జ : మౌసిన్రామ్ (మేఘాలయ).

