BIKKI NEWS (AUG. 12) : contract jobs in sc Gurukulas. రాష్ట్రంలోని ఎస్సీ గురుకులాల్లో బోధన సిబ్బందిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు సంస్థ ప్రకటన విడుదల చేసింది.
contract jobs in sc Gurukulas
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులకు ఆగస్టు 13న డెమో తరగతులు నిర్వహించనున్నట్లు సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఖాళీల వివరాలు : జేఎల్, పీజీటీ, టీజీటీ, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, లైబ్రేరియన్, పీడీ/పీఈటీ, హెల్త్ సూపర్వైజర్ పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నాయని పేర్కొంది.
డెమో నిర్వహించే చిరునామా
ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు ఆగస్టు 13న ఉదయం 8.00 గంటలకు సరూర్ నగర్ బాలికల గురుకుల పాఠశాలలో హాజరు కావాల్సి ఉంటుంది.
పురుష అభ్యర్థులు షేక్ పేట ఎస్సీ గురుకుల పాఠశాలలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది.
ఉదయం 10 గంటల నుంచి డెమో తరగతులు ఉంటాయని తెలిపారు.
ప్రతిభ ఆధారంగా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు 7569017276, 9701110138 నంబర్లలో సంప్రదించవచ్చు.

