Telangana jobs – తెలంగాణ జాబ్ వేకెన్సీలపై కమిటీ

BIKKI NEWS (JULY 15) : comittee on job vacancies in telangana. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు, సంస్థలు, యూనివర్సిటీలు, స్థానిక సంస్థల్లో మంజూరైన ఉద్యోగుల సంఖ్య, ప్రస్తుత ఖాళీలు, ప్రస్తుతం ఉన్న పలు ఉద్యోగాలు అవసరమా? లేదా? అన్న అంశాలపై సమీక్షించడానికి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.

comittee on job vacancies in telangana

మాజీ సీఎస్ ఎ.శాంతి కుమారి అధ్యక్షతన, వేతన సవరణ కమిషన్ చైర్మన్ ఎన్. శివశంకర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి రఘునందన్ రావు సభ్యులుగాఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ మొదటి సమావేశం సోమవారం ఆన్లైన్ ద్వారా జరిగింది.

ఇందులో భాగంగా పశుసంవర్ధక శాఖ, అటవీ, పర్యావరణ శాఖలోని పోస్టుల గురించి చర్చించారు. రెండు విభాగాల్లో మంజూరైన పోస్టులు, ప్రస్తుతం పనిచేస్తున్న వారి సంఖ్య, ఖాళీలు, ఉద్యోగాల వివరాలతో కూడిన సమాచారాన్ని రెండు రోజుల్లోగా పూర్తిస్థాయిలో ఆర్థిక శాఖ, ఆయా విభాగాలు కమిటీకి సమర్పించాలని ఆదేశించారు.

వచ్చేవారం లో ఈ రెండు ప్రభుత్వ శాఖలపై సమీక్ష తర్వాత ఆ పోస్టులు అవసరమా? లేదా? అన్న అంశాలపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

ఈ విధంగా అన్ని శాఖలపై సమీక్షించాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే.