BIKKI NEWS (AUG. 22) : Civil assistant surgeon job notification by MHSRB. తెలంగాణ రాష్ట్రంలో 1623 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు .
Civil assistant surgeon job notification by MHSRB
వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు’ ఈ నోటిఫికే షన్ ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది.
ఆరోగ్యశాఖలో ఇప్పటికే సుమారు 8 వేల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. వివిధ హోదాల్లో కలిపి మరో 7 వేల పోస్టులను నింపేందుకు భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.
ఇటీవలే 607 అసిస్టెంట్ ప్రొఫెసర్, 48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్, 4 స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే