Census 2027 house listing schedule released

CENSUS–2027 : హౌస్‌ లిస్టింగ్ ప్రక్రియ షెడ్యూల్ విడుదల

BIKKI NEWS (JAN. 07) : CENSUS 2027 HOUSE LISTING SCHEDULE RELEASED. దేశ వ్యాప్తంగా నిర్వహించనున్న జనగణన – 2027లో భాగంగా హౌస్‌ లిస్టింగ్ (ఇళ్ల వివరాల నమోదు) ప్రక్రియను 2027 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

CENSUS 2027 HOUSE LISTING SCHEDULE RELEASED

ముఖ్య వివరాలు:

ప్రతి రాష్ట్రం / కేంద్ర పాలిత ప్రాంతం తమకు అనుకూలమైన తేదీలను ఎంచుకుని, ఈ వ్యవధిలో 30 రోజుల పాటు హౌస్‌లిస్టింగ్ సర్వే నిర్వహించాలి.

ప్రజలకు సౌకర్యంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ (తామే వివరాలు నమోదు చేసుకునే అవకాశం) కూడా కల్పించనున్నారు.

ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను, ఇంటింటి సర్వే ప్రారంభానికి ముందు 15 రోజుల పాటు నిర్వహిస్తారు.

అనంతరం ఫీల్డ్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి అధికారికంగా వివరాలు సేకరిస్తారు.

ఈ ప్రక్రియ ద్వారా గృహాలు, కుటుంబ సభ్యులు, మౌలిక వసతులపై సమగ్ర సమాచారం సేకరించనున్నారు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →