CBSE SCHOLARSHIP – సీబీఎస్ఈ స్కాలర్షిప్

BIKKI NEWS (SEP. 25): CBSE SINGLE GIRL CHILD SCHOLARSHIP 2025. సీబీఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ 2026 కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు.

CBSE SINGLE GIRL CHILD SCHOLARSHIP 2025

ఈ పథకం ద్వారా బాలికలు ఏకైక సంతానంగా ఉన్నచో స్కాలర్షిప్ ను అందజేస్తారు

పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన బాలికల నుండి 2025 సంవత్సరానికి సంబంధించి ఈ స్కీమ్ కింద దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది.

స్కాలర్షిప్ విలువ : నెలకు 1000/- చొప్పున రెండు సంవత్సరాల పాటు స్కాలర్షిప్ అందిస్తారు.

అర్హతలు : సీబీఎస్ఈ లో పదోతరగతిలో 70% తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి మరియు ప్రస్తుత విద్యా సంవత్సరంలో సీబీఎస్ఈ అనుబంధ విద్యాసంస్థలో 11వ తరగతి అడ్మిషన్ పొంది ఉండాలి.

ఇప్పటికే ఈ స్కాలర్షిప్ అందుకుంటున్న విద్యార్థినిలు 12వ తరగతిలో రెన్యువల్ చేసుకోవాలంటే పదకొండవ తరగతిలో 70% మార్కులను సాధించి ఉండాలి.

దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు

CBSE SCHOLARSHIP LINK