BIKKI NEWS : BSF HEAD CONSTABLE JOBS NOTIFICATION 2025. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో 1121 హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్) నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు.
BSF HEAD CONSTABLE JOBS NOTIFICATION 2025
పోస్టుల వివరాలు :
- హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్) – 910
- హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్) 211.
అర్హతలు : 60 శాతం మార్కులతో ఫిజిక్స్, కెమిస్త్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ కలిగి ఉండాలి. లేదా పదో తరగతితోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి : 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.(ఓబీసీలకు 18 నుంచి 28 ఏండ్లు, ఎస్సీ, ఎస్టీ లకు 18 నుంచి 30 ఏండ్లు ఉండాలి.)
దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా 2025 ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుం : 100/- రూపాయలు (ఎస్సీ, ఎస్టీ, మహిళలు, డిపార్ట్మెంటల్, ఎక్స్ సర్వీసెమెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.)
ఎంపిక విధానం :
- మొదటి దశలో ఆర్ఎఫ్డీ ద్వారా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్/ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టు నిర్వహిస్తారు.
- రెండో దశ లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది.
- మూడో దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, డిక్టేషన్ టెస్ట్ నిర్వహిస్తారు.
వెబ్సైట్ : bsf.gov.in

