BIKKI NEWS (OCT. 02) : BR AMBEDKAR OPEN UNIVERSITY Now Digital University. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని డిజిటల్ యూనివర్సిటీగా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
BR AMBEDKAR OPEN UNIVERSITY Now Digital University
విద్యార్థులు చదువుకునేందుకు, తరగతులకు హాజరయ్యేందుకు, ప్రాక్టికల్ పరీక్షలకు మినహా విద్యార్థులు హైదరాబాద్ వచ్చే అవసరం లేకుండా అంతా డిజిటలీకరణ చేస్తున్నారు.
ఇందులో భాగంగా పీఎం-ఉష పథకం కింద రూ.10 కోట్లతో డిజిటల్ రిసోర్స్ సెంటర్ ను, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.20 కోట్లతో… సమీకృత లెర్నింగ్ సెంటర్ ను, నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
వివిధ సమస్యలతో చదువును మధ్యలోనే వదిలేసిన గోండులు, చెంచులు, కోయలు మొదలైన ఆదివాసీ యువతకు అంబేడ్కర్ వర్సిటీ ఉచితంగా దూరవిద్యను అందిస్తోంది.
ఇంటర్ అర్హత ఉన్న దివ్యాంగులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలను అందిస్తున్నారు. మారుమూల గ్రామాల్లో ఉంటున్న దివ్యాంగులకు వారికి సమీపంలోనే స్టడీ సెంటర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
ట్రాన్స్ జెండర్లు యూట్యూబ్ పాఠాల లింకులను పంపుతున్నారు. ట్రాన్స్ జెండర్ల సందేహాలను నివృత్తి చేసేందుకు కొందరు ఆచార్యులకు బాధ్యతలు అప్పగించారు.
- PM YASASVI Scholarship 2026-27 Online Apply – 1.25 లక్షల వరకు ఉపకార వేతనం
- NCS One Portal Launch 2026 For all job notifications – దేశవ్యాప్తంగా ఒకే జాబ్ పోర్టల్
- Today Gold Rate 23rd November 2026 – ఈరోజు బంగారం, వెండి, ప్లాటినం ధరలు
- current affairs in Telugu_english 22 November 2026
- Telangana Pre Primary Instructor Ayah Recruitment – త్వరలోనే 5538 ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ ఆయాల నియామకం

