BIKKI NEWS : Bathukamma celebrations at tankbund on 18th. సెప్టెంబర్ 18న సాయంత్రం 5 గంటలకు, ట్యాంక్ బండ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పెద్ద బతుకమ్మకు మహిళలందరికి స్వాగతం పలుకుతున్నామని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.
Bathukamma celebrations at tankbund on 18th
తెలంగాణ ఆడపడుచులు అందరికీ పేరుపేరునా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ పూలతో చెరువులను శుద్ధి చేసుకునే పండుగని, పూలను పూజించుకునే పండుగ బతుకమ్మని ఈ సందర్భంగా తెలిపారు.
ఆత్మీయత అనురాగాలను కలపోసుకొని, కష్టసుఖాలను చెర్వుగట్టుల మీద పంచుకునే పండుగ బతుకమ్మ పండుగ అని అన్నారు.
ఈ పండుగ సందర్భంగా… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, సాంసృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారి ఆలోచనతో అన్ని గ్రామాలలో బతుకమ్మ పండుగ పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నామని అన్నారు.
రేపు సాయంత్రం 5 గంటలకు, ట్యాంక్ బండ్ వద్ద పెద్ద ఎత్తున బతుకమ్మ జరుపుతున్న సందర్భంగా హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న మహిళలంతా బతుకమ్మ వేడుకల్లో పాల్గొనవలసిందిగా స్వాగతం పలుకుతున్నామని తెలిపారు.
పండగ మన ప్రాంత అస్తిత్వాన్ని, జీవన విధానాన్ని, వారసత్వ విధానాన్ని తెలియజేస్తుందని, మనం దేవుళ్ళని పూలతో పూజిస్తాం. కానీ, పూలనే దేవల్లుగా పూజించే సంప్రదాయం ప్రపంచంలో మన దగ్గర మాత్రమే ఉంది. నవ ధాన్యాలనే ప్రసాదాలుగా పంచుతామని గుర్తు చేశారు.
తొమ్మిదో రోజున బతుకమ్మ పండుగ, అక్టోబర్ 18 నాడు, బతుకమ్మ పైన గౌరమ్మలను పసుపుతో చేసుకొని చెరువులో సాగనంపుదాం. మళ్లీ సంవత్సరం కోసం ఎదురుచూస్తామని తెలిపారు
అరుదైన పండుగ, మహిళలకు ఎంతో ఆత్మగౌరవం కలిగించే పండుగ బతుకమ్మ పండుగ, మీ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని తెలిపారు.

