Welcome kit - ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు - bikki news

Welcome Kit – ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు

  • bikki news : 29-01-2026

Welcome Kit to government junior college students. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్ లతో కూడిన వెల్కమ్ కిట్ ను అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ఏర్పాట్లు చేస్తున్నారు.

Welcome Kit to government junior college students.

వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థులు చేరిన మొదటి రోజే విద్యార్థులకు పలు వస్తువులతో కూడిన వెల్కమ్ కిట్ ను అందించేందుకు ఇంటర్మీడియట్ బోర్డ్ ఏర్పాట్లు చేస్తుంది.

వెల్కమ్ కిట్ లో తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్, నోటుబుక్స్, యూనిఫామ్, మరియు వర్క్ బుక్స్ ఉండనున్నాయి. వీటిని విద్యార్థులు అడ్మిషన్ తీసుకుని కాలేజీకి వచ్చిన తొలిరోజే అందించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.

ఇంటర్మీడియట్ విద్యార్థులకు యూనిఫామ్ ఏర్పాటు చేయడం రాష్ట్ర చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం విశేషం.

పేద విద్యార్థుల మీద ఆర్థిక భారాన్ని తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటించారు.

వచ్చే విద్యా సంవత్సరం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1.20 లక్షల అడ్మిషన్లు తమ లక్ష్యమని ఈ సందర్భంగా తెలిపారు.

మారిన సిలబస్ కు అనుగుణంగా నూతన పాఠ్యపుస్తకాలను ఏప్రిల్ నుండి అందుబాటులో ఉంచుతామని శ్రీకృష్ణ ఆదిత్య తెలిపారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →