- BIKKI NEWS : 23-01-2026
PTM SUCCESS IN GOVERNMENT JUNIOR COLLEGES. తెలంగాణ రాష్ట్రంలోని 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు రెండవ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ను విజయవంతంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో 50,000 మందికి పైగా తల్లిదండ్రులు పాల్గొని, తమ పిల్లల విద్యా ప్రగతి, హాజరు వివరాలు మరియు ఫిబ్రవరిలో జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల సన్నద్ధతపై సమీక్షించారు.
PTM SUCCESS IN GOVERNMENT JUNIOR COLLEGES.
గత రెండు సంవత్సరాలలో ఇంటర్మీడియట్ విద్యా రంగంలో ప్రభుత్వం చేపట్టిన ప్రధాన సంస్కరణలు, మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్బంగా తల్లిదండ్రులకు వివరించారు.
Table of Contents
విరివిగా నిధులు మంజూరు
కళాశాలల మరమ్మత్తులు, వైట్ వాషింగ్, గ్రీన్ బోర్డుల ఏర్పాటు కోసం ₹56.16 కోట్లు మంజూరు చేయగా, మరొక 41 కళాశాలల మరమ్మత్తులు కోసం ₹10,25 కోట్లు మంజూరు చేశారు.
అదనంగా 300 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కొత్త మరుగుదొడ్లు, తరగతి గదులు, భవనాల నిర్మాణానికి ₹49.63 కోట్లు మంజూరు చేశారు. పరిశుభ్రమైన కళాశాలల పరిసరాల నిర్వహణ కోసం నిధులు క్రమం తప్పకుండ అందజేస్తున్నారు.
ప్రతి కళాశాలకు ప్రయోగశాల పరికరాల కోసం ₹50,000 మరియు క్రీడా సామగ్రి కోసం ₹10,000 నిధులు మంజూరు చేయగా, అధికంగా విద్యార్థులు ఉన్న కళాశాలలకు అదనపు నిధులు అందజేశారు.
డిజిటల్ తరగతి గదులు
ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెండు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (IFPs), రెండు ఇంటరాక్టివ్ డిజిటల్ ప్రొజెక్టర్లు (IDPs), ఇంటర్నెట్ మరియు Physics Wallah Khan Academy ల సహకారంతో JEE, NEET, CLAT తదితర పోటీ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందిస్తున్నారు.
Wall of fame
కళాశాలల పేరు బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు, విజయవంతమైన పూర్వ విద్యార్థులను ప్రదర్శించే “వాల్ ఆఫ్ ఫేమ్” ను ఏర్పాటు చేశారు. ప్రతిభావంతులైన విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులను సత్కరించడం ద్వారా ప్రస్తుత విద్యార్థులకు ప్రోత్సాహం అందించారు.
భద్రతా, భరోసా
కళాశాలల్లో CCTV కెమెరాలు, అగ్నిమాపక భద్రతా చర్యలు అమలు చేశారు. విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిరక్షణ కోసం TELE MANAS హెల్ప్ లైన్ (14416), శిక్షణ పొందిన కౌన్సిలర్లు, అలాగే ధ్యానం, జీవన నైపుణ్యాలు. భావోద్వేగ స్థైర్యాన్ని పెంపొందించే HELP కార్యక్రమం అమలు చేస్తున్నారు.
ఈ మెగా పీటీఎం సందర్భంగా పాల్గొన్న తల్లిదండ్రులు, రాష్ట్రంలో విద్యాభివృద్ధికి నిరంతరంగా కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
పండుగ వాతావరణం
హాజరైన తల్లిదండ్రులు మరియు కళాశాల లో చదివి సక్సెస్ అయిన పూర్వ విద్యార్థులు కళాశాలల పనితీరు పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ విలువైన సూచనలు చేశారు. కళాశాలల్లో రంగురంగుల ముగ్గులు, సెల్ఫీ స్టాండ్ లు నెలకొల్పి పండుగ వాతావరణం నెలకొల్పారు. ఈ కార్యక్రమాల ద్వారా రాష్ట్రప్రభుత్వం సమగ్ర, సమావేశక మరియు భవిష్య దృష్టితో కూడిన విధానాన్ని అనుసరిస్తూ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలను ఆధునికంగా, విద్యార్థి హితంగా తీర్చిదిద్దుతూ, విద్యతో పాటు శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహిస్తోందని తెలియవర్పింది.
మెగా పేరెంట్ టీచర్స్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కళాశాల ప్రిన్సిపల్స్ మరియు అధ్యాపకులకు ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య గారు అభినందనలు తెలిపారు.
- Today current affairs in Telugu May 12th 2026 – కరెంట్ అఫైర్స్
- Daily current affairs in Telugu May 11th 2026 – కరెంట్ అఫైర్స్
- Top current affairs 10th May 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Today Gold Rate June 14th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- TG ICET 2026 Results విడుదల, ర్యాంక్ కార్డు కోసం క్లిక్ చేయండి

