Court jobs exam pattern – 859 కోర్టు ఉద్యోగాల పరీక్ష విధానం

Court jobs exam pattern - 859 కోర్టు ఉద్యోగాల పరీక్ష విధానం - bikki news
  • BIKKI NEWS : 21-01-2021

COURT JOBS EXAM PATTERN. తెలంగాణలోని జిల్లా కోర్టులో 859 ఉద్యోగాలు భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

COURT JOBS EXAM PATTERN.

ఈ పోస్టులకు అర్హతలుగా ఏడవ తరగతి, పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ కలవు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారు కొన్ని పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

నేపథ్యంలో ఈ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష విధానాన్ని కింద వివరించడం జరిగింది. దీని ఆధారంగా అభ్యర్థులు తమ ప్రిపరేషన్ ప్లాన్ ను చేసుకోవచ్చు

పరీక్ష విధానం :

స్టెనోగ్రాఫర్ గ్రేడ్ III :
  • క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీని పరిశీలించిన తర్వాత అభ్యర్థులను స్కిల్ టెస్టుకు అనుమతిస్తారు.
  • స్కిల్ టెస్టులో భాగంగా ఇంగ్లిష్ షార్ట్ హ్యాండ్ లో 120 డబ్ల్యూపీఎం వేగంతో (ఐదు నిమిషాల సమయంలో) పూర్తిచేయాల్సి ఉంటుంది.
  • ఆ తర్వాత ట్రాన్స్ క్రిప్షన్ లో 45 నిమిషాల్లోపు కంప్యూటర్ల పైన చేయాల్సి ఉంటుంది.
  • ఈ స్కిల్ టెస్టుకు 100 మార్కులు కేటాయించారు.
జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ :
  • ఈ నాలుగు పోస్టులకు ఎగ్జామినేషన్ సిలబస్ ఒకే విధంగా ఉన్నది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ లో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు.
  • ప్రశ్నపత్రం స్థాయి కనీస విద్యార్హతకు అంటే గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఉంటుంది.
  • మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. జనరల్ నాలెడ్జ్ 60 ప్రశ్నలు 60 మార్కులకు. జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు 40 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది.
  • 120 నిమిషాల్లో ఎగ్జామ్ పూర్తి చేయాలి.
  • జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ఇస్తారు.
టైపిస్ట్ :
  • కంప్యూటర్ ను ఉపయోగించి నిర్వహించే ఇంగ్లిష్ టైప్టింగ్ పరీక్ష (నిమిషానికి 45 పదాల వేగంతో) 10 నిమిషాలపాటు ఉంటుంది‌. ఈ స్కిల్ టెస్టుకు 100 మార్కులు కేటాయించారు.
ఫీల్డ్ అసిస్టెంట్ ప్రాసెస్ సర్వర్ :
  • ఈ పరీక్ష ఆఫ్లైన్ లో ఓఎంఆర్ పద్ధతిలో ఉంటుంది.
  • ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి.
  • ప్రశ్నపత్రం పదో తరగతి స్థాయిలో ఉంటుంది.
  • మొత్తం 50 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది.
  • జనరల్ నాలెడ్జ్ 45 ప్రశ్నలు 45 మార్కులకు ఉంటుంది.
  • ఈ ఎగ్జామ్ లో అర్హత సాధించాలంటే అన్ రిజర్వ్. ఈడ బ్ల్యూఎస్ 40 శాతం, బీసీ 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు 30 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
  • అర్హత సాధించిన అభ్యర్థులను జిల్లాల వారీగా ఖాళీల ఆధారంగా 1: 3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. మౌఖిక ఇంటర్వ్యూ (వైవావోస్) కు 5 మార్కులు ఉంటుంది
Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →