PROCECUTION- పెండింగ్ చలాన్ లు కట్టకుంటే ప్రాసిక్యూషన్

Procecution for pending traffic challans
  • BIKKI NEWS : 21-01- 2026

Procecution for pending traffic challans. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ట్రాఫిక్ పెండింగ్ చలాన్ లు వసూళ్ల కొరకు వాహనదారులకు నోటీసులు జారీ చేసి ప్రాసిక్యూషన్ చేయాలంటూ కీలక ఆదేశాలు జారీ చేసింది.

Procecution for pending traffic challans

పెండింగ్ చలాన్ ల వసూళ్ల విషయంలో వాహనదారులను ట్రాఫిక్ పోలీసులు రోడ్ మీద ఇబ్బంది పెట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది.

మీ ట్రాఫిక్ చలాన్ ను ఇక్కడ చెక్ చేసుకోవచ్చు.

ట్రాఫిక్ పోలీసులు పెండింగ్ ట్రాఫిక్ చలాన్ లు వసూళ్లు కొరకు వాహనాలను సీజ్ చేయడం, కీ లను లాక్కోవడం వంటి చర్యలు చేయకూడదని సూచించింది.

వాహనదారులు స్వచ్చందంగా పెండింగ్ చలాన్ లను చెల్లించేలా అవకాశం ఇవ్వాలని, కట్టుకుంటే నోటీసులు జారీ చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది.

ట్రాఫిక్ చలాన్ లను వసూలు చేయడానికి విడుదల చేసిన జీవో నెంబర్ 108 నిలిపివేయాలని దాఖలైన పిటిషన్ సందర్భంగా హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

2011 లో విడుదలైన జీవో నెంబర్ 108 ని నోటిఫై చేసి గెజిట్ విడుదల చేయలేదని ప్రభుత్వ తరపున న్యాయవాది అంగీకరించారు.

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టబద్ధమైన చర్యలు తీసుకునే అధికారం పోలిసులకు ఉందని, పెండింగ్ చలాన్ వసూళ్ల కోసం నోటీసు జారీ చేసి ప్రాసిక్యూషన్ చేయాలంటూ ఆదేశాలు జారీచేశారు.

అలాగే తదుపరి విచారణను ఫిబ్రవరి 3వ తేదికి వాయిదా వేశారు. ప్రభుత్వం తరుపున సమగ్ర కౌంటర్ ను ఆరోజు దాఖలు చేసే అవకాశం ఉంది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK