Agniveer vayu - ఇంటర్ తో అగ్ని వీర్ వాయ ఉద్యోగాలు - bikki news

AGNIVEER VAYU – ఇంటర్ తో అగ్ని వీర్ వాయ ఉద్యోగాలు

  • BIKKI NEWS : 15 JAN. 2026

AGNIVEER VAYU 2026 NOTIFICATION BY IAF. భారత వైమానిక దళం అగ్నివీర్ వాయు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ 2026 నువిడుదల చేసింది.

AGNIVEER VAYU 2026 NOTIFICATION BY IAF

ఖాళీలు : అగ్నివీర్ వాయు. రాష్ట్రాల వారీగా పోస్టుల కేటాయింపుల మేరకు నియామకాలు చేపడతారు.

దరఖాస్తు విధానం గడువు : ఆన్లైన్ ద్వారా 2026 ఫిబ్రవరి 01 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు

అర్హతలు : గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులుగా ఇంటర్మీడియట్/10+2/సమాన అర్హత కలిగి ఉండాలి. లేదా కనీసం 50 శాతం మార్కులతో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. లేదా కనీసం 50 శాతం మార్కులతో నాన్ ఒకేషనల్ సబ్జెక్టులతో ఒకేషనల్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఇంగ్లీష్ సబ్జెక్టులో తప్పనిసరిగా 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.

వయోపరిమితి : 2005 జనవరి 1న 2009, జూలై 1న మద్య జన్మించిన వారు అర్హులు.

అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులందరికీ 649/- రూపాయాలు

ఎంపిక విధానం :

  • ఫేజ్-1లో ఆన్‌లైన్ టెస్ట్
  • ఫేజ్-2లో డాక్యుమెంట్ వెరిఫికేషన్,
  • ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పీఎఫ్ టీ-I & పీఎఫ్ టీ-II),
  • అడాప్టబిలిటీ టెస్ట్-I (ఆబ్జెక్టివ్ టైప్ రాత పరీక్ష),
  • అడాప్టబిలిటీ టెస్ట్-II (ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

సిలబస్ :

  • సీబీఎస్‌ఈ 10+2 సిలబస్ ప్రకారం ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ & జనరల్ అవేర్‌నెస్ (ఆర్‌ఏజీఏ)
  • ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు ఇస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు నెగెటివ్ మార్కులు విధిస్తారు.

ఫేజ్-1 ఆన్లైన్ పరీక్ష తేదీ: 2026 మార్చి 30, 31న నిర్వహించనున్నారు

వెబ్సైట్

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →