BIKKI NEWS (JAN. 06) : 3000 LICENSED SURVEYOR JOBS IN TELANGANA. తెలంగాణ రైతుల భూములకు సంబంధించి గుండెకాయలాంటి సర్వే విభాగాన్ని పటిష్టపరుస్తున్నామని ఇందులో భాగంగా ఇప్పటికే 3500 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను తీసుకోవడం జరిగిందని వారం రోజుల్లో మరో మూడువేల మందిని తీసుకోబోతున్నామని తెలిపారు.
3000 LICENSED SURVEYOR JOBS IN TELANGANA
రెవెన్యూ, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్, సర్వే- ల్యాండ్ రికార్డ్స్ విభాగాలను భూభారతి పోర్టల్‌లో ఒకే గొడుగు కిందకు తీసుకువస్తున్నామని ఈ పోర్టల్‌ను మార్చి నాటికి పూర్తి స్ధాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
ప్రజలకు మరింత మెరుగైన సేవలు, పారదర్శకంగా ఉండేలా ఈ పోర్టల్‌ను రూపొందించామని వెల్లడించారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, దేవాదాయ, అటవీ, వక్ప్ భూములు తదితర అన్ని వివరాలు కనిపించేలా పోర్టల్‌లో పొందుపరిచామని తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు తమ ప్రభుత్వం అర్ధం చేసుకుందని, రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక ఇబ్బందుల వల్లే కొంత ఆలస్యం జరుగుతుందని ప్రభుత్వం తరపున ప్రభుత్వ ఉద్యోగులకు అందాల్సిన అన్ని ప్రయోజనాలను అందిస్తామని హామీ ఇచ్చారు.
- Today current affairs in Telugu June 12th 2026 – కరెంట్ అఫైర్స్
- Daily current affairs in Telugu June 11th 2026 – కరెంట్ అఫైర్స్
- Top current affairs 10th June 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Today Gold Rate June 14th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- TG ICET 2026 Results విడుదల, ర్యాంక్ కార్డు కోసం క్లిక్ చేయండి

