BIKKI NEWS (DEC. 28) : 2025 indian cricket round up and Victories. 2025 భారత క్రికెట్ చరిత్రలో గుర్తుండిపోయే సంవత్సరంగా నిలిచిపోనుంది. పురుషుల జట్టు, మహిళల జట్టు, అండర్ 19 పురుషుల, మహిళల జట్లు చిరస్మరణీయ విజయాలను సాధించాయి.
2025 indian cricket round up and Victories
పురుషుల క్రికెట్ జట్టు :
రోహిత్ శర్మ నేతృత్వంలో భారత జట్టు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచింది. న్యూజిలాండ్ పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. చివరిగా 2013లో ఈ టైటిల్ ను భారత జట్టు సాధించింది.
ఆసియా కప్ 2025 విజేతగా కూడా భారత జట్టు నిలిచింది. ఫైనల్ లో పాకిస్తాన్ పై విజయం సాధించి 9 వ ఆసియా కప్ టైటిల్ ను గెలుచుకుంది.
భారత మహిళల జట్టు :
భారత మహిళల జట్టు మొట్టమొదటిసారి వన్డే వరల్డ్ కప్ 2025 ను గెలుచుకుంది. ఫైనల్ లో దక్షిణాఫ్రికాపై ఐదు వికెట్ల తేడాతో గెలిచింది.
U 19 పురుషుల జట్టు :
ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ పై ఓడిపోయి రన్నర్ గా అండర్ 19 పురుషుల జట్టు నిలిచింది.
U 19 మహిళల జట్టు :
ఐసీసీ అండర్ 19 టీట్వంటీ వరల్డ్ కప్ 2025 ను భారత మహిళల యువ జట్టు గెలుచుకుంది. ఫైనల్ లో దక్షిణాఫ్రికా ను ఓడించి వరుసగా రెండో వరల్డ్ కప్ ను మహిళల యువ జట్టు గెలుచుకుంది.
IPL 2025 :
18 సంవత్సరాల తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపిఎల్ 2025 విజేతగా నిలిచింది. ఫైనల్ లో పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించింది.
WPL 2025 :
ఉమెన్ ప్రీమియర్ లీగ్ 2025 విజేతగా ముంబై ఇండియన్స్ జట్టు నిలిచింది ఈ జట్టుకు ఇది రెండో WPL టైటిల్ కావడం విశేషం. ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయం సాధించింది.
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
- Today Gold Rate August 6th 2026 – భారీగా పెరిగిన బంగారం ధర
- Hiroshima Day – హిరోషిమా దురంఘతం ఆగస్టు 06
- Siddipet district Anganwadi jobs notification – సిద్దిపేట జిల్లాలో 91 అంగన్వాడి జాబ్స్
