BIKKI NEWS (DEC. 03) : GHMC EXTENDED AS TCUR. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిని మొత్తం తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (TCUR) పరిధిగా విస్తరించినట్లు ప్రభుత్వం అధికారిక గెజిట్ ద్వారా ప్రకటించింది. ఈ మేరకు G.O.Ms.No.264 ను మెట్రోపాలిటన్ ఏరియా & అర్బన్ డెవలప్మెంట్ శాఖ 03.12.2025న విడుదల చేసింది.
GHMC EXTENDED AS TCUR.
GHMC చట్టంలో కీలక మార్పులు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం, 1955లో ప్రభుత్వం తాజా సవరణలు చేపట్టింది. డిసెంబర్ 1, 2 తేదీల్లో వెలువడిన ఆర్డినెన్సుల ఆధారంగా కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
ఈ సవరణల ప్రకారం:
20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లను నూతనంగా జీహెచ్ఎంసీ పరిధిలో విలీనం చేశారు.
ఈ 27 ప్రాంతాలను తెలంగాణ మున్సిపాలిటీస్ చట్టం పరిధి నుండి తొలగించబడ్డాయి. తదుపరి ఆర్డినెన్స్ ప్రకారం మొత్తం 27 అర్బన్ లోకల్ బాడీస్ GHMC నగర పరిధిలోనికి తీసుకురాబడ్డాయి.
ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, GHMC పరిధి మొత్తం తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌గా గుర్తింపు పొందింది. సెక్షన్ 3(3B) ప్రకారం నిర్ధారించబడిన నగర పరిమితులు 02.12.2025 నుంచే అమల్లోకి వచ్చినట్లుగా ప్రభుత్వం స్పష్టం చేసింది.

- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
