BIKKI NEWS (NOV. 23) : Court verdict on Weightage for MPHA contract employees.. తెలంగాణ రాష్ట్రంలో మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల నియామకాల్లో కాంట్రాక్ట్ మరియు తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందికి 20 నుంచి 30% వరకు వెయిటేజ్ పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు చెల్లవని హైకోర్టు తాజాగా తీర్పు చెప్పింది.
Court verdict on Weightage for MPHA contract employees.
2023లో విడుదల చేసిన నోటిఫికేషన్లు అదే శాఖలో పని చేస్తున్న కాంట్రాక్టు తాత్కాలిక ఉద్యోగులకు 20 శాతం వెయిటేజ్ ఇస్తూ 1520 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది.
అయితే దీనిని 20% నుంచి 30% పెంచుతూ మధ్యంతర ఉత్తర్వులు జీవో 133ని ప్రభుత్వం జారీ చేసింది.
దీనిపై జగిత్యాల నివాసి హైకోర్టును ఆశ్రయించి… వెయిటేజ్ 20% మించొద్దని హైకోర్టు ఫుల్ బెంచ్ ధర్మాసనం తీరికచ్చిందని, గతంలో సుప్రీంకోర్టు కూడా ఈ మేరకు తీర్పులు వెలువరించిందని తన వాదనలు వినిపించింది.
ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ ఇది ప్రభుత్వ విధాన నిర్ణయం అని, ప్రభుత్వ విధాన నిర్ణయాలలో కోర్టులు జోక్యం చేసుకోరాదని గతంలో సుప్రీంకోర్టు అనేక కేసుల్లో తీర్పిచిందని గుర్తు చేశారు.
వాదనలు విన్న హైకోర్టు 20 శాతం వరకు మాత్రమే వెయిటేజ్ ఇవ్వాలని, 30% కొరకు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు జీవో 133 ని కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. దీంతో ఈ నియామకాలకు సంబంధించిన న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోనున్నాయి. త్వరలోనే నియామక ప్రక్రియ పూర్తికానుంది.
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

