BIKKI NEWS (NOV. 22) : Ordinance on Regularization of contract employees in Telangana act.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఇతర తాత్కాలిక ఉద్యోగులు తమ సర్వీసు క్రమబద్ధీకరణ కోరుతూ మరియు క్రమబద్ధీకరణ కాబడిన ఉద్యోగులు పాత పెన్షన్ కోరుతున్న నేపథ్యంలో ఈ అంశాలపై ఆర్డినెన్సు తేవాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
Ordinance on Regularization of contract employees in Telangana act.
తాజాగా ఆర్థిక శాఖ క్రమబద్ధీకరణ కాబడిన కాంట్రాక్టు ఉద్యోగుల కు పాత పెన్షన్ అమలుకు సంబంధించిన అంశంపై సవరణ ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించిన సంగతి తెలిసిందే. పాత పెన్షన్ అమలు చేస్తే 26 వేల కోట్ల అదనపు భారం పడుతుందని అర్దిక శాఖ తెలిపినట్లు సమాచారం.
అయితే తాత్కాలిక ఉద్యోగులు క్రమబద్ధీకరణ కొరకు, క్రమబద్ధీకరణ కాబడిన కాంట్రాక్టు ఉద్యోగులు పాత పెన్షన్ కొరకు కోర్టులను ఆశ్రయిస్తున్న నేపథ్యంలో న్యాయస్థానాలు అనుకూలంగా తీర్పులిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఇందుకు సంబంధించిన 1994 చట్టం (రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్ టు పబ్లిక్ సర్వీ సెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ అండ్ పే స్ట్రక్చర్)కు సవరణ చేయాలని నవంబర్ 17న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇందుకు ఆమోదం తెలిపింది.
ఈ నేపథ్యంలో దీనిపై నేడో రేపో ఆర్డినెన్స్ జారీ కానున్నట్లు సమాచారం. 1994 ఏప్రిల్ 22న జీవో నంబర్ 212, ఆ తర్వాత 1997 జూలై 23న జీవో 112 ప్రభుత్వం జారీ చేసింది. ఈ జీవోల్లోని అంశాలను 1998 చట్టంలోనూ చేర్చారు. ఈ జీవో లో ప్రకారం తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్ధీకరణకు వీలు కలుగుతుంది.
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

