TSAT ద్వారా TET 2026 డిజిటల్ ఉచిత కోచింగ్ ప్రారంభం

Tsat ద్వారా tet 2026 డిజిటల్ ఉచిత కోచింగ్ ప్రారంభం - bikki news

BIKKI NEWS (NOV. 19) : TSAT FREE COACHING FOR TET 2026. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ కోసం సిద్ధమవుతున్న అభ్యర్థుల ప్రయోజనార్థం టీఎస్‌ఏటీ టీజీ టెట్ – 2026 డిజిటల్ ఫ్రీ కోచింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని ఐటీ & ఇండస్ట్రీస్ మంత్రి దుడ్డిళ్ల శ్రీధర్ బాబు బుధవారం ప్రారంభించారు.

TSAT FREE COACHING FOR TET 2026.

నవంబర్ 19న టెట్ ప్రత్యేక ఒరియెంటేషన్ సెషన్లు నిర్వహించబడతాయి. అనంతరం 44 రోజులపాటు మొత్తం 200 ఎపిసోడ్‌లతో నిరంతర కోచింగ్ ప్రసారం కానుంది.

ప్రసార వివరాలు: TSAT NIPUNA CHANNEL ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు కోచింగ్ ప్రసారం అవుతాయి.

TSAT VIDYA CHANNEL ద్వారా ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు
ఈ రెండు ఛానళ్లలో రోజుకు మొత్తం 4 గంటల ప్రత్యేక పాఠాలు అందుబాటులో ఉంటాయి.

కవర్ చేయనున్న సబ్జెక్టులు: టెట్ పరీక్షకు అవసరమైన ముఖ్యాంశాలై…

  • చైల్డ్ డెవలప్‌మెంట్ &PEDAGOGY,
  • సైకాలజీ,
  • ఫిజికల్ సైన్స్,
  • బయాలజికల్ సైన్స్,
  • గణితం,
  • సామాజిక శాస్త్రం,
  • అలాగే ఇంగ్లీష్, తెలుగు సహా ఇతర అవసరమైన పాఠ్యాంశాలు ప్రసారం కానున్నాయి.

పేపర్–1 మరియు పేపర్–2 అభ్యర్థులు ఈ డిజిటల్ పాఠాలను ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.

లెషన్స్ ఎక్కడ లభ్యం.?

  • టీఎస్‌ఏటీ శాటిలైట్ ఛానళ్లు
  • టీఎస్‌ఏటీ మొబైల్ యాప్
  • యూట్యూబ్ అధికారిక ఛానల్

టీజీ టీటీ 2026 కు సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఈ ఉచిత డిజిటల్ కోచింగ్‌ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని ప్రభుత్వం కోరింది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →