BIKKI NEWS (JAN. 02) : Intermediate Director conducting key review meeting with all GJCs. తెలంగాణ ఇంటర్మీడియట్ డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య జనవరి 03 మధ్యాహ్నం 2:00 గంటలకు జిల్లా ఇంటర్ విద్యాధికారులు, 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్, స్టాప్ తో కలిసి కీలక రివ్యూ మీటింగ్ ను జూమ్ ద్వారా నిర్వహించనున్నారు.
Intermediate Director conducting key review meeting with all GJCs
సమావేశం అజెండా ముఖ్యాంశాలు:
1) యుటిలైజేషన్ సర్టిఫికేట్స్: చిన్న మరమ్మతులు, క్రీడలు, శానిటేషన్ తదితర అంశాలపై ఖర్చుల వినియోగంపై సమీక్ష.
2) బోర్డుల ప్రమాణీకరణ & బ్రాండింగ్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల భవనాలకు వైట్ రంగుతో బ్లూ బోర్డర్ పెయింటింగ్ పనుల పురోగతి, బోర్డు ప్రమాణీకరణ స్థితి.
3) ఫైవ్ సక్సెస్ స్టోరీస్: ప్రతి ప్రిన్సిపాల్ తమ కళాశాలలో అమలైన ఐదు ఉత్తమ పద్ధతులు లేదా విజయాలు వివరించాల్సి ఉంటుంది.
4) డిజిటల్ తరగతి గదులు, ఇంటరాక్టివ్ ప్లాట్ మరియు డిజిటల్ ప్యానెల్స్ ఏర్పాటుపై చర్యలు
5) PTM – మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు ల పై చర్యలు
6) సీసీ కెమేరాలు : సీసీ కెమెరాలు ఏర్పాటు, పనితీరు, కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానం
7) ల్యాబోరేటరీలు : రాబోయే ప్రాక్టికల్ పరీక్షల సిద్ధత, ప్రాక్టికల్ పరీక్షల ఏర్పాట్లపై సమీక్ష.
ఈ అజెండాకు సంబంధించిన అన్ని వివరాలు, నివేదికలు ముందుగా సిద్ధం చేసుకోవాలని, అలాగే ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఆడియో–విజువల్ ఏర్పాట్లు ముందుగానే పర్యవేక్షించాలని అధికారులకి ఆదేశాలు జారీ అయ్యాయి.
- Rain Holiday today – ఈ జిల్లాలలో పాఠశాలలకు సెలవు
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
