BIKKI NEWS (NOV. 13) : 14236 ANGANWADI JOBS NOTIFICATION SOON IN TELANGANA. తెలంగాణ రాష్ట్రంలో 14,236 అంగన్వాడి ఉద్యోగాల భర్తీ కోసం అనుమతి లభించినప్పటికీ నోటిఫికేషన్ కు మోక్షం లభించడం లేదు.
14236 ANGANWADI JOBS NOTIFICATION SOON IN TELANGANA
రిజర్వేషన్ల అంశం మరియు న్యాయపరమైన చిక్కులతో నోటిఫికేషన్ విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతుంది.
నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడి కేంద్రాలలో 6,399 టీచర్ ఉద్యోగాలు, 7,837 ఆయా (హెల్పర్) ఉద్యోగాలు భర్తీ చేయడానికి అనుమతి లభించింది.
ఈ నోటిఫికేషన్ కు సంబంధించి రిజర్వేషన్లు విడుదల చేయాల్సి ఉండగా దీనిపై స్పష్టత లేకపోవడంతో నోటిఫికేషన్ విడుదలలో జాప్యం జరుగుతోంది.
ఏజెన్సీ ప్రాంతాల్లో అంగన్వాడీ ఉద్యోగాలను గిరిజనులతో మాత్రమే భర్తీ చేయాలని నిర్ణయం తీసుకోవడంతో కొందరు ఈ అంశంపై కోర్టుకు వెళ్లారు. దీంతో ఎనిమిది నెలలుగా నోటిఫికేషన్ విడుదల కాలేదు.

