BIKKI NEWS (SEP. 21) : International Day of Peace september 21st. అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని ఐక్య రాజ్య సమితి దేశాలన్నీ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21 తేదీన జరుపుకుంటాయి.
International Day of Peace september 21st.
అంతర్జాతీయంగా కాల్పుల విరమణ, అహింస, శాంతి, సోదరభావాల సాధన కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. .ఎటువంటి అల్లర్లు, ఘర్షన్లు కేకుండా శాంతియుత జీవనానికే ప్రజానీకం మొగ్గుచుపుతుంది . శాంతి కపోతాలు ఎగరవేసి శాంతిపట్ల తమకు గల విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు.
ప్రపంచ శాంతికోసం అంతర్జాతీయ స్థాయిలో అనేక సమావేసాలు జరుపుతారు . వ్యక్తులు, సంస్థలు, దేశాలు ప్రపంచశాంతికోసం తమవంతు ప్రయత్నాలు, ఆచరణీయ కార్యక్రమాలు చేపట్టడానికి ఉద్దేశించిన రోజు ఇది .
కాలం గడిచేకొద్దీ అంతర్జాతీయ శాంతి దినోత్సవం నిజంగానే ప్రపంచ వ్యాప్త స్వభావాన్ని సంతరించుకుంటోంది. ప్రతిదేశంలోనూ ఈ ఉత్సవాన్ని సంరంభంగా జరుపుకుంటున్నారు. ఆవిర్భావము : 1981లో సెప్టెంబర్ 21న ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశం ప్రారంభ సందర్భంగా కోస్టారికా సమర్పించిన తీర్మానం ప్రకారం ప్రతి ఏటా సెప్టెంబర్ 21ని ప్రపంచ శాంతి దినంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం ప్రకటించింది. సర్వత్రా శాంతియుత భావాలను బలోపేతం చేయడానికి గాను ప్రపంచ శాంతి దినం అంకితమవుతుంది. తొలి ప్రపంచశాంతి దినాన్ని 1982 సెప్టెంబర్ లో నిర్వహించారు . 2002 లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సెప్టెంబర్ 21 వ తేదీని అంతర్జాతీయ శాంతి దినోత్సవ్ నిర్వహణకు శాశ్విత తేదిగా ప్రకటిండం జరిగింది .
ప్రపంచ దేశాల మధ్య శాంతి ఒడంబడికపై సంతకాలు జరిగిన 50వ సంవత్సరంగా కూడా 2008 సెప్టెంబర్ 21 చరిత్రలో నమోదవుతోంది. ఈ సంవత్సరం ప్రపంచ శాంతి దినోత్సవాన్ని పునస్కరించుకుని మహాత్మా గాంధీ అహింసా పురస్కారానికి ప్రపంచ స్థాయిలో తొలిసారిగా రెవరెండ్ ఆర్చ్‌బిషప్ డెస్మండ్ టూటూ ఎంపికయ్యారు.
ప్రపంచ శాంతిని పాదుకొల్పడంలో డెస్మండ్ టూటూ చేసిన అవిరాళ కృషిని గుర్తించిన ‘ ది జేమ్స్ మాడిసన్ యూనివర్శిటి (జేఎమ్‌యూ) ‘ లోని మహాత్మా గాంధీ ప్రపంచ స్థాయి అహింసా కేంద్రం ఆయనకు పురస్కారాన్ని అందించాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 21న వర్జీనియాలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఆయనకు పురస్కారాన్ని అందచేయాలని నిర్ణయించారు.