BIKKI NEWS (FEB. 20) : World Poetry day 2026 a poem by Addagudi Umadevi. ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా అడ్డగూడి ఉమాదేవి రచించిన ప్రత్యేక కవిత.
World Poetry day 2026 a poem by Addagudi Umadevi
ఆవేశాక్షర శరాలను సంధిస్తూ
సమసమాజ నిర్మాణానికి అంకుశమవుతాడు
పదనెక్కిన పదమై పద్మవ్యూహాలను ఛేదిస్తూ
అభ్యుదయ పథ దిక్సూచిలా సాగుతాడు
వడిగొను వాక్య వాతూలమై వర్ణాలను మట్టిలో కలుపుతూ నిచ్చెన మెట్లను కూల్చుతాడు
గర్జించు గ్రంథమై గురివిందగింజల నిజరూపుకు నిలువెత్తు సాక్షమౌతాడు
పేకమేడల కలల సౌధాలకు పునాదియై
చెదిరిన బతుకులకు చేయూతగ నిలుస్తాడు
నిశ్శబ్ద శబ్దాల సారమై మనసు పొరలను తాకుతూ
అనంత భావావేశ ఉత్తుంగ తరంగాల సింధువవుతాడు
అక్షరమై,పదమై,వాక్యమై,గ్రంథమై రవి గాంచని చోటుకు సాగుతూ
అక్షర శిల్పియై పొత్తమునేలుతాడు
అడ్డగూడి ఉమాదేవి
తెలుగు అధ్యాపకురాలు
సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రి కళాశాల
వరంగల్
9908057980
- Yadadri district Anganwadi jobs notification – యాదాద్రి భువనగిరి జిల్లాలో 79 అంగన్వాడి జాబ్స్
- Today Gold Rate July 27th 2026 – పెరిగిన బంగారం ధర
- Today top news in Telugu July 27th 2026 – నేటి ప్రధాన వార్తలు
- Daily GK Bits in Telugu part 157 – జనరల్ నాలెడ్జ్
- France vs SPAIN : FIFA Live updates – ఫైనల్ కు చేరుకున్న స్పెయిన్
