విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి: డీఐఈఓ శ్రీధర్ సుమన్

  • రంగశాయిపేట జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు

BIKKI NEWS (SEP. 20) : Freshers day celebration in GJC Rangasaipet. విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లో, సాంకేతికత, వైజ్ఞానిక రంగాల్లో రాణించాలని, వారిని ప్రోత్సహించేలా అధ్యాపకులు హాజరుపై దృష్టి సారించాలని వరంగల్ జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాధికారి డా.శ్రీధర్ సుమన్ అన్నారు.

Freshers day celebration in GJC Rangasaipet.

శనివారం నాడు రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తొలుత దీప ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలువురు విద్యార్థులు పాటలతో, నృత్యాలతో విద్యార్థులను అలరించారు.

కళాశాల ప్రిన్సిపాల్ గత సం. విద్యార్థులు చూపిన ప్రతిభను నివేదిక రూపంలో చదివి వినిపించారు. ఈ సందర్భంగా డీఐఈఓ శ్రీధర్ సుమన్ మాట్లాడుతూ విద్యార్థుల, సిబ్బంది హాజరు మెరుగుదల కోసం ముఖగుర్తింపు హాజరు సత్ఫలితాలనిస్తున్నదని, కళాశాలకు హాజరు కాని విద్యార్థుల సమాచారం వెంటనే తల్లిదండ్రులకు మెసేజ్ ల రూపంలో పంపించబడుతున్నాయని అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అధ్యాపకులు బోధనా రీతులను మెరుగు పర్చుకోవాలని, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న సేవలను, కళాశాల టైం టేబుల్, విద్యార్థుల ఫలితాలు, అటెండెన్స్, రికార్డులను పరిశీలించి కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సంపత్ కుమార్, లైబ్రేరియన్ రాములు, అధ్యాపకులు రేమిడి మల్లారెడ్డి, ఎల్లాస్వామి, వీరాంజన్ కుమార్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..