BIKKI NEWS (SEP. 19) : 12452 POLICE JOBS NOTIFICATION IN TELANGANA SOON. తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఉద్యోగాల భర్తీ కోసం ఖాళీల వివరాలు ప్రభుత్వం సేకరించినట్లు సమాచారం ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీలలో 12,452 పోలీస్ ఉద్యోగ ఖాళీగా ఉన్నట్లు తేలింది.
12452 POLICE JOBS NOTIFICATION IN TELANGANA SOON
ఉద్యోగ ఖాళీలపై మాజీ సిఎస్ శాంతి కుమారి నేతృత్వంలో ఏర్పడిన కమిటీ వివిధ శాఖల నుండి సమగ్రంగా ఉద్యోగ ఖాళీలపై వివరాలను సేకరిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే పోలీస్ శాఖ నుండి సమాచారం ఈ కమిటీకి అందినట్లు సమాచారం. ఈ కమిటీ ఈ ఖాళీల అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి భర్తీ కొరకు ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్లు సమాచారం.
కమిటీ అందిన సమాచారం మేరకు రాష్ట్రవ్యాప్తంగా 12452 పోలీస్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్లు తెలిసింది. ఈ కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు కింది విధంగా ఉన్నాయి.
TG POLICE JOBS VACANCIES 2025
- పోలీస్ కానిస్టేబుల్ (సివిల్) – 8,442
- పోలీస్ కానిస్టేబుల్ (ఎఆర్) – 3,271
- సబ్ ఇన్స్పెక్టర్ (సివిల్) – 677
- సబ్ ఇన్స్పెక్టర్ (ఎఆర్) – 40
- సబ్ ఇన్స్పెక్టర్ (టీజీఎస్పీ) – 22
- మొత్తం : 12,452