GROUP 1 – డివిజన్ బెంచ్ కు ఆశ్రయించిన TGPSC

Group 1 - డివిజన్ బెంచ్ కు ఆశ్రయించిన tgpsc - bikki news

BIKKI NEWS (SEP. 18) : TGPSC APPEAL IN HIGH COURT ON GROUP 1. గ్రూప్‌-1 పరీక్ష ఫలితాల పై సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ హైకోర్టులో అప్పీల్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

TGPSC APPEAL IN HIGH COURT ON GROUP 1

సింగిల్‌ జడ్జి తుది తీర్పు గతంలో వెలువరించిన మధ్యంతర ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్నదని ఆ పిటిషన్‌లో పేర్కొన్నది.

టీజీపీఎస్సీ తరఫున అదనపు కార్యదర్శి, నోడల్‌ అధికారి (లీగల్‌) ఆర్‌ సుమతి ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలో 719 మంది అభ్యర్థులు ఒకే రకమైన మార్కులు సాధించడం, అభ్యర్థుల సంఖ్యలో వ్యత్యాసంపై టీజీపీఎస్సీ ఇచ్చిన వివరణను సింగిల్‌ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదని, కోఠి మహిళా కాలేజీలో పరీక్ష రాసిన అభ్యర్థుల్లో 14.8% మంది టాప్‌-500 మందిలో ఉన్నారనేందుకు ఆధారాలు లేవని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →