BIKKI NEWS (SEP. 17) : Hindi day celebration in GJC Malkajgiri. ప్రభుత్వ జూనియర్ కళాశాల మల్కాజ్గిరి యందు హిందీ భాషా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు మరియు దేశభక్తి గీతాలు, కవిత, ఉపన్యాస పోటీలు నిర్వహించడం జరిగింది.
Hindi day celebration in GJC Malkajgiri.
ఇందులో పాల్గొన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ, బహుమతులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గత సంవత్సరంలో కూడా వార్షిక పరీక్షలలో 99 మార్కులు సాధించినటువంటి 35 మంది విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ఇవ్వటం జరిగింది.
వార్షిక పరీక్షలలో కళాశాలలలో అత్యధిక మార్కులు సాధించినటువంటి నిత్యసత్యనాయుడు, బిందు, మాధవి రత్నం లకు విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరిగింది.
కళాశాల ప్రిన్సిపాల్ ఉమాదేవి గారు మాట్లాడుతూ… హిందీ భాష యొక్క గొప్పతనాన్ని కొనియాడారు. హిందీ భాష నేర్చుకోవడం లో ఉన్న తృప్తి ఏ భాషలో ఉండదని, భాష సరళంగా, మధురంగా, తొందరగా అర్థం అయ్యేవిధంగా ఉంటుందని చెప్పడం జరిగింది. మాతృభాష తెలుగును మరువకుండా, దేశ భాష హిందీని నేర్చుకోవాలని తెలియజేశారు.
హిందీ అధ్యాపకులు డాక్టర్. గోపి గారు మాట్లాడుతూ… దేశ సమైక్యతను చాటేది హిందీ భాషేనని, దేశ విదేశాలలో కూడా హిందీని నేర్చుకుంటున్నారని ప్రపంచంలోనే మూడవ స్థానంలో హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారని వివిధ విశ్వవిద్యాలయంలో కూడా హిందీ భాషను నేర్చుకుంటున్నారని మరియు రాష్ట్ర అంతర్రాష్ట్రియ రంగాలలో ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారని హిందీ భాష నేర్చుకోవటం వల్ల సమా సమాజంలో గౌరవంగా బ్రతకగలమని తెలియజేశారు. రష్యాలో కూడా ఈ భాష నేర్చుకోవడానికి ముందుకు వస్తున్నారని తెలియజేశారు.
ఈ సమావేశంలో విద్యాసాగర్ రెడ్డి శోభ రమణకుమారి చంద్రశేఖర్ శృతి జగన్ నవనీత భాస్కర్ రెడ్డి సంతోషి లక్ష్మి రాజమౌళి పద్మజా భబిత అరుణ వాసంతి హసీనా రైముద్దిన్ రాజ్ కుమార్ విజయ్ ఆది శ్రీనివాస్ కల్పన వంశీ ఆగస్టిne పాల్ ఝాన్సీ సాయిబాబా విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు