BIKKI NEWS (SEP. 13) : MBBS and BDS ADMISSIONS IN TELANGANA 2025. తెలంగాణ రాష్ట్ర కాళోజీ హెల్త్ యూనివర్సిటీ 2025 – 26 విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ , బీడీఎస్ ప్రవేశాల కోసం 16,620 మందితో కూడిన ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల చేసింది.
MBBS and BDS ADMISSIONS IN TELANGANA 2025
సెప్టెంబర్ 16వ తేదీ నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
సెప్టెంబర్ 14 సాయంత్రం 5 గంటల లోపు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని వర్సిటీ స్పష్టం చేసింది.
అభ్యంతరాల స్వీకరణ తర్వాత ఫైనల్ మెరిట్ జాబితాను వర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
5769 తెలంగాణ ఎంబీబీఎస్ సీట్లు
తెలంగాణ రాష్ట్రంలో 35 ప్రభుత్వం మెడికల్ కళాశాలలో 4,148 సీట్లు ఉన్నాయి వీటిలో 3,519 సీట్లు రాష్ట్ర కోటా కింద మెరిట్ లిస్టు ప్రకారం పొందే అవకాశం ఉంది. 26 ప్రైవేట్ కళాశాలలో సుమారు 4,500 సీట్లు ఉండగా అందులో 2,250 సీట్లు కన్వీనర్ కోటా కింద పొందే అవకాశం ఉంది. మొత్తంగా 5,769 సీట్లు రాష్ట్ర కోటా కింద తెలంగాణ స్థానికత గల విద్యార్థులకు దక్కనున్నాయి.
వెబ్సైట్ : https://www.knruhs.telangana.gov.in/
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
