Telangana Class 11 Board Exams Inter Merger 2026 – 11వ తరగతి పరీక్షలు ఉంటాయా

Telangana class 11 board exams inter merger 2026

BIKKI NEWS (Nov. 24) : Telangana Class 11 Board Exams Inter Merger 2026. తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్‌ను విలీనం (Inter Merger) చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కీలక చర్చ మొదలైంది. ఇకపై ఇంటర్మీడియట్‌కు బదులుగా 11, 12వ తరగతులుగా పిలుస్తామని ప్రకటించిన క్రమంలో, 11వ తరగతికి బోర్డు పరీక్షలు ఉంటాయా.. ఉండవా.. అనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు మరియు విద్యావేత్తల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Telangana Class 11 Board Exams Inter Merger 2026

దీనిపై ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, త్వరలో విడుదల చేయనున్న ఇంటర్ విలీన ముసాయిదా నివేదికపై (Draft Report) ప్రజాభిప్రాయం తీసుకునే సమయంలో పరీక్షల అంశంపైనా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ మంది 11వ తరగతికి బోర్డు పరీక్షలు వద్దని అభిప్రాయపడుతున్నట్లు విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.

11వ తరగతికి బోర్డు పరీక్షలు ఎందుకు వద్దంటున్నారంటే?
  • వరుస ఒత్తిడి నుంచి ఉపశమనం: 10వ తరగతి నుంచి 12వ తరగతి వరకు వరుసగా మూడేళ్లు బోర్డు పరీక్షలు ఉండటం వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని, అందువల్ల 11వ తరగతికి బోర్డు పరీక్షలు ఉండరాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
  • జాతీయ బోర్డుల విధానం: సీబీఎస్ఈ (CBSE), ఐసీఎస్ఈ (ICSE) తో పాటు పలు దేశాల్లో 11వ తరగతికి బోర్డు పరీక్షలు లేవని, కేవలం కళాశాల/పాఠశాల స్థాయిలో మాత్రమే అంతర్గత పరీక్షలు నిర్వహిస్తున్నారని గుర్తుచేస్తున్నారు.
  • విద్యాకమిషన్ & తమిళనాడు బాట: తెలంగాణ విద్యాకమిషన్ సైతం 11వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేసి, ఆ ఏడాది సబ్జెక్టుపై లోతైన అవగాహన పెంచడం, ప్రాక్టికల్స్ నిర్వహించడంపై దృష్టి సారించాలని సూచించింది. తమిళనాడు ప్రభుత్వం కూడా 2025-26 విద్యా సంవత్సరం నుంచి 11వ తరగతి పబ్లిక్ పరీక్షలను రద్దు చేసింది.

ఇవి కూడా చూడండి :

• ఇంటర్ విలీనంపై ప్రజాభిప్రాయ సేకరణ

• ఇంటర్ విలీన నేపద్యంలో ప్రభుత్వ హామీలు

Telangana Class 11 Board Exams Inter Merger 2026 – బోర్డు పరీక్షలు ఉండాలని వాదిస్తున్న వారి అభిప్రాయాలు ఇవే!
  • పేద విద్యార్థులు & హాజరు సమస్య: సీబీఎస్ఈ విద్యార్థులతో పోలిస్తే రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరే వారిలో 90 శాతానికి పైగా పేద కుటుంబాలకు చెందిన వారే ఉంటారు. గురుకులాలు మినహా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సగటు విద్యార్థుల హాజరు 65 శాతానికి మించడం లేదు. 11వ తరగతికి బోర్డు పరీక్షలు లేకపోతే విద్యార్థుల హాజరు మరింత తగ్గే ప్రమాదం ఉందని అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
  • భారీ సిలబస్ & ఉత్తీర్ణత శాతం: పదో తరగతితో పోలిస్తే 11, 12 తరగతుల్లో సిలబస్ మూడు, నాలుగు రెట్లు అధికంగా ఉంటుంది. బోర్డు పరీక్షలు లేకుంటే విద్యార్థులు 11వ తరగతి పాఠ్యాంశాలను తేలికగా తీసుకుంటారని, ఫలితంగా 12వ తరగతి పాఠాలు అర్థం కాక ఉత్తీర్ణత శాతం తగ్గిపోతుందని అభిప్రాయపడుతున్నారు.
  • ప్రవేశ పరీక్షల సన్నద్ధత: జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్, నీట్ (NEET), సీయూఈటీ (CUET) వంటి జాతీయ ప్రవేశ పరీక్షలు రెండేళ్ల సిలబస్ ఆధారంగా జరుగుతాయి. బోర్డు పరీక్షలు లేకుంటే ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు కేవలం ప్రవేశ పరీక్షల కోచింగ్‌పైనే దృష్టి సారించే అవకాశం ఉందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు.
Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →