BIKKI NEWS : (Nov. 15) : khelo india youth games 2026 logo and mascot . తెలంగాణ వేదికగా వచ్చే డిసెంబరు 11 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న 8వ ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్ – 2026’ అధికారిక లోగో, మస్కట్‌లను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు, కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ మన్‌సుఖ్ మాండవీయ గారు ఆవిష్కరించారు.
khelo india youth games 2026 logo and mascot
ఢిల్లీలో కేంద్ర మంత్రి అధికారిక నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి గారు, రాష్ట్ర మంత్రి శ్రీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (క్రీడలు) శ్రీ ఏపీ జితేందర్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు గారితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లా కేంద్రాల్లో ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహణకు స్టేడియాలు సిద్ధం చేసినట్లు ముఖ్యమంత్రి గారు వివరించారు. 27 క్రీడాంశాల్లో 7 వేల మందికి పైగా క్రీడాకారులు తలపడనున్నారని తెలిపారు.
మూడేళ్లలోనే రాష్ట్ర క్రీడా బడ్జెట్‌ను రూ. 113 కోట్ల నుంచి రూ. 465 కోట్లకు పెంచినట్లు సీఎం గారు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ఇప్పటికే 61 మినీ స్టేడియాల నిర్మాణం పూర్తి కాగా, మరో 15 స్టేడియాల పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు.
khelo india youth games 2026 logo and mascot – మస్కట్ ‘నీలమణి’ ప్రత్యేకతలు
- అధికారిక లోగో & ట్యాగ్‌లైన్: తెలంగాణ సాంస్కృతిక వారసత్వం, క్రీడా స్ఫూర్తి కలబోతగా ఈ లోగోను రూపొందించారు. ఇందులో కాకతీయ కళాతోరణం, హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం, బాపూఘాట్ వద్ద ప్రతిపాదిత గాంధీ సరోవర్‌లోని గాంధీ టవర్, బతుకమ్మ పండుగకు ప్రతీక అయిన తంగేడు పువ్వు, 7 క్రీడా ఆకృతులను పొందుపరిచారు. ఈ గేమ్స్‌కు “ఖేల్ కా జునూన్, తెలంగాణ కీ జాన్ ఔర్ పెహచాన్” (Khel Ka Junoon, Telangana Ki Jaan Aur Pehchaan) అనే ట్యాగ్‌లైన్‌ను ఖరారు చేశారు.
- మస్కట్ ‘నీలమణి’ (Neelamani): యువతలోని ఉత్సాహం, చురుకుదనం, పట్టుదలకు ప్రతీకగా ‘నీలమణి’ పేరుతో మస్కట్‌ను ఆవిష్కరించారు. నీలం మరియు టర్కోయిస్ రంగు ఈకలతో ఆకర్షణీయంగా ఉన్న ఈ మస్కట్ ఆత్మవిశ్వాసాన్ని, నాయకత్వ లక్షణాలను ప్రతిబింబిస్తుంది.
6 నగరాల్లో పోటీలు.. తొలిసారిగా ‘కర్రసాము’ ప్రదర్శన!
- వేదికలు: హైదరాబాద్ (ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ తదితర వేదికల్లో 22 క్రీడాంశాలు) సహా రాష్ట్రంలోని 6 నగరాల్లో పోటీలు జరగనున్నాయి. ఖమ్మం (ఆర్చరీ), హనుమకొండ (అథ్లెటిక్స్), కరీంనగర్ (జూడో), నిజామాబాద్ (టేబుల్ టెన్నిస్), మహబూబ్‌నగర్ (కబడ్డీ) జిల్లా కేంద్రాల్లో స్టేడియాలను సిద్ధం చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
- క్రీడాంశాలు & క్రీడాకారులు: ఈ మెగా ఈవెంట్‌లో 27 పోటీ క్రీడాంశాలు, 2 ప్రదర్శన క్రీడలతో (మొత్తం 29 విభాగాలు) దాదాపు 7 వేల నుంచి 8 వేల మంది వరకు క్రీడాకారులు, సిబ్బంది పాల్గొననున్నారు. ముఖ్యంగా సాఫ్ట్‌బాల్ (Softball) తొలిసారిగా పోటీ క్రీడగా ప్రవేశపెట్టబడగా, తెలంగాణ సంప్రదాయ యుద్ధకళ ‘కర్రసాము’ (Karra Samu) మరియు సెయిలింగ్ (Sailing) లను ప్రదర్శన క్రీడలుగా చేర్చారు.
క్రీడా రంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
- మూడేళ్లలోనే రాష్ట్ర క్రీడా బడ్జెట్‌ను రూ. 113 కోట్ల నుంచి రూ. 465 కోట్లకు పెంచినట్లు సీఎం తెలిపారు.
- గ్రామీణ స్థాయిలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో ఇప్పటికే 61 మినీ స్టేడియాల నిర్మాణం పూర్తి కాగా, మరో 15 స్టేడియాల పనులు వివిధ దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు.

