Mee Seva Centres – మీసేవ కేంద్రాల ఏర్పాటుకు నోటిఫికేషన్

BIKKI NEWS (AUG. 29) : Mee Seva Centres formation in ranga reddy district. రంగారెడ్డి జిల్లాలో మీసేవ కేంద్రాల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఈమేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

Mee Seva Centres formation in ranga reddy district.

మీసేవా కేంద్రాలు వివరాలు

గండిపేట మండలం :

  • వట్టినాగులపల్లి
  • గండిపేట
  • కిస్మత్ పూర్
  • గంధంగూడ,

మొయినాబాద్ మండలం

  • అజీజ్ నగర్
  • హిమాయత్ నగర్
  • కనకమామిడి,

చౌదరిగూడ మండలం

  • తుంపల్లి
  • ఎదిర

సరూర్ నగర్ మండలం

  • తుమ్మబౌలి,

మంచాల మండలం

  • లోయపల్లిలో

దరఖాస్తు గడువు : ప్రత్యక్షంగా దరఖాస్తు చేయడానికి ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 20వ తేదీ వరకు అవకాశం కలదు.

దరఖాస్తు ఫీజు : రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి పేరు మీద డి.డి. రూ.500/- (Non refundable) తీసి ఫారం వెంబడి జత చేయవలెను.

అర్హతలు :
  • అభ్యర్థి స్థానికుడై ఉండవలెను (మండలము ప్రామాణికముగా)
  • కనీస విద్యా అర్హతలు (డిగ్రీ మరియు ఆపై అర్హతలు).
  • కంప్యూటర్ గురించి పూర్తి అవగాహన సర్టిఫికేట్ కలిగియుండవలెను.
  • ధరఖాస్తు దారుని వయసు 21 సం. నుండి 44 సం.లలో ఉండవలెను.
  • మీ కేంద్రాలను నిర్వహించుటకు సరైన పెట్టుబడి స్థోమత కలిగి ఉండవలెను.
  • దరఖాస్తు దారులకు రాత పరీక్ష మరియు మౌఖిక పరీక్ష నిర్వహించి అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది.
  • వ్యక్తులను ఎన్నుకునేటప్పుడు సాధ్యమైనంతవరకు, పేద / వికలాంగ యువత మరియు సమాజంలోని ఇతర వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.
  • ఎన్నికైన అభ్యర్థి నేర చరిత్ర నిర్ధారణ అయినచో వారిని అనర్హులుగా పరిగణించబడతారు.
వెబ్సైట్ : https://rangareddy.telangana.gov.in/notification-issued-for-new-meeseva-centers-in-rangareddy-district/