Transfers – మార్చిలో టీచర్ల బదిలీలు, పదోన్నతులు: పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన

Telangana teachers transfers and promotions in march 2027.

BIKKI NEWS (OCT. 01) : Telangana teachers transfers and promotions in March 2027. తెలంగాణ పాఠశాల విద్యాశాఖలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు (Teachers Transfers), పదోన్నతుల (Promotions) ప్రక్రియకు రంగం సిద్ధమైంది. మార్చి 2027లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ముగిసిన వెంటనే ఈ ప్రక్రియను చేపడతామని విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అధ్యక్షతన, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఇ. నవీన్ నికోలస్ సమక్షంలో ఉపాధ్యాయ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి, టీచర్ల ప్రధాన సమస్యలు, సర్వీస్ నిబంధనలపై విస్తృతంగా చర్చించారు.

Telangana teachers transfers and promotions in March 2027.

జీవో 317 బాధిత ఉపాధ్యాయులకు ఊరటనిచ్చేలా జీవో 190 అమలు, భార్యాభర్తల (Spouse) మ్యూచువల్ బదిలీల ప్రక్రియను జనగణన పూర్తయిన వెంటనే చేపడతామని అధికారులు హామీ ఇచ్చారు. అలాగే లోకల్ బాడీ నుంచి గవర్నమెంట్‌కు మారిన వారికి పే ప్రొటెక్షన్ ఫైల్ త్వరలోనే క్లియర్ కానుందని, సమగ్రశిక్షా సిబ్బంది బదిలీలు, ఫిట్టింగ్ ప్రక్రియలు పూర్తి చేసి వారికి మినిమం టైమ్ స్కేల్ వర్తింపజేసే ఫైలును కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉన్న పాఠశాలల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించనున్నట్లు వెల్లడించారు.

స్కూల్ ఎడ్యుకేషన్‌లో నాణ్యతా ప్రమాణాలు పెంచే దిశగా సమ్మేటివ్ అసెస్మెంట్-1 (SA-1) మూల్యాంకనంలో పాఠశాల విద్యాశాఖ కీలక మార్పులు చేపట్టింది. పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన 6వ, 9వ తరగతులకు ‘ఎక్స్‌టర్నల్ మూల్యాంకనం’ నిర్వహించాలని నిర్ణయిస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కొత్త విధానాన్ని ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో అమలు చేస్తున్నారు.

Also Read…

• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్

పాఠశాలల పనివేళలను తిరిగి ఉదయం 9:30 గంటలకు మార్చాలన్న ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తిపై కమిటీ ద్వారా నివేదిక తెప్పించుకుని తుది నిర్ణయం తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. అలాగే స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంల అధికారాలను ఎంఈవోలకు బదలాయించే అంశాన్ని పరిశీలించేందుకు ఎస్సీఈఆర్టీ శ్రీహరి, అడిషనల్ డైరెక్టర్ లింగయ్యలకు బాధ్యతలు అప్పగించారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల ప్రమోషన్ల ప్రక్రియను సైతం సత్వరమే పూర్తి చేస్తామని విద్యాశాఖ భరోసా ఇచ్చింది.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →