Daily gk bits 167 for compititive exams

Daily GK Bits 167 – జనరల్ నాలెడ్జ్ బిట్స్

BIKKI NEWS : Daily GK Bits 167 for compititive exams. పోటీ పరీక్షల కొరకు డైలీ జీకే బిట్స్ రౌండప్ ‌

Daily GK Bits 167 for compititive exams

1) ఏ సంవత్సరంలో భారత దేశంలో విదేశీ చెల్లింపుల విషయంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది.?
జ : 1991

2) రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో భారతదేశం ఏ దేశం నుండి ఎక్కువగా వస్తువులను కొనుగోలు చేసింది.?
జ : ఇంగ్లండ్

3) మానవుడిలో ఎన్ని జతల లాలాజల గ్రంధులు ఉంటాయి.?
జ : మూడు జతలు

4) దంతాలపై అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు.?
జ : ఓడెంటాలజి

5) మానవుడిలో ఉన్న అవశేషా అవయవాల సంఖ్య ఎంత.?
జ : 180

6) బ్యూటీ విటమిన్ అని దేనికి పేరు.?
జ : టోకోఫెరాల్

7) శాకాహరులలో లోపించి ఉండే దంతాలు.?
జ : అగ్రచర్వణకాలు

8) మానవునిలో దంత సూత్రం ఏమిటి.?
జ : 2123/2123

9) రెండో మెదడు అని దేనిని అంటారు.?
జ : జీర్ణనాడీ మండలం

10) అత్యంత సున్నితమైన విటమిన్ ఏది.?
జ : C విటమిన్

11) దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారిగా ఎప్పుడు జనాభా లెక్కలు సేకరించారు.?
జ : 1951

12) స్వాతంత్రానికి పూర్వం భారత దేశంలో సమగ్రంగా ఒకేసారి జనాభా లెక్కలు ఏ సంవత్సరంలో చేపట్టారు.?
జ : 1881

13) 1881 లో ఏ బ్రిటిష్ గవర్నర్ జనరల్ జనాభా లెక్కలను భారతదేశంలో చేపట్టారు.?
జ : లార్డ్ రిప్పన్

14) జనాభా లెక్కల గురించి భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ లో ఉంటుంది.?
జ : ఏడవ షెడ్యూల్

15) జనాభా లెక్కల గురించి భారత రాజ్యాంగంలోని ఏ అధికరణలో ఉంటుంది.?
జ : ఆర్టికల్ 246

16) 1951 – 2011 మద్య భారతదేశంలో ఎన్ని సార్లు జనాభా లెక్కల కార్యక్రమం చేపట్టారు.?
జ : ఏడు సార్లు

17) జనాభా లెక్కల కార్యక్రమాన్ని ఏ వ్యక్తి నుండి ప్రారంభిస్తారు.?
జ : భారత రాష్ట్రపతి

18) దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కులాల వారీగా జనాభా లెక్కలు చేపట్టిన తొలి రాష్ట్రం ఏది.?
జ : కేరళ (1968)

19) మూత్రం ఉత్పత్తికి బాధ్యత వహించే ప్రాథమిక అవయవం ఏది.?
జ : మూత్రపిండాలు

20) మూత్రపిండం క్రియాత్మక యూనిట్ ఏది.?
జ : నెఫ్రాన్

21) ఏ పదార్థం ప్రధానంగా మూత్రపిండాల ద్వారా విసర్జితం అవుతుంది.?
జ : యూరియా

22) నెఫ్రాన్ లోని ఏ భాగం రక్తం వడబోతకు భాద్యత వహిస్తుంది.?
జ : భౌమన్ గుళిక

23) మూత్రపిండాలు పాడైన వ్యక్తికి చేయాల్సిన చికిత్స పేరు ఏమిటి.?
జ : డయాలసిస్

24) మూత్రపిండాలకు అనుబంధంగా ఉండే గ్రంధి ఏమిటి.?
జ : ఎడ్రినల్ గ్రంథి

25) సాధారణంగా ఒక రోజులో ఉత్పత్తి అయ్యే మూత్రం పరిమాణం ఎంత.?
జ : 800 – 2,000 మిల్లీ లీటర్లు

26) మూత్రంలో ప్రోటీన్ ఉండటాన్ని ఏమని అంటారు.?
జ : ప్రోటీనురియా

27) మూత్రపిండాలు శరీరంలోని ఏ కుహరంలో ఉంటాయి.?
జ : ఉదర కుహరం

28) ప్రోటీన్ జీవక్రియ వలన ఏర్పడి ప్రధాన వ్యక్తపదార్థం ఏది.?
జ : యూరియా

29) శరీరంలో నీటి సమతుల్యతను నియంత్రించే హార్మోన్ ఏది.?
జ : యాంటీ డియురేటిక్ హార్మోన్

30) అశోకుడు ఏ సంవత్సరంలో కళింగ యుద్ధం చేశాడు.?
జ : క్రీ. పూ. 261

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →