BIKKI NEWS (August 01) : Vana Mahotsavam at GJC Girls Husnabad. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల హుస్నాబాద్ లో జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ మరియు ఎన్ఎస్ఎస్ చైర్మన్ శ్రీమతి వంకడోత్ లలిత గారు అధ్యక్షత వహించడం జరిగింది.
Vana Mahotsavam at GJC Girls Husnabad
కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం మరియు బృందము, విద్యార్థినిలు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అందరూ కలిసి కళాశాల ప్రాంగణంలో వివిధ రకాలైన మొక్కలను నాటడం జరిగింది
కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపల్ మరియు ఎన్ఎస్ఎస్ చైర్మన్.శ్రీమతి వంకడోత్ లలిత గారు మాట్లాడుతూ.మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత.విద్యార్థినిలతో పాటు సమాజంలోని ప్రతి పౌరుల యొక్క బాధ్యత అని తెలిపారు.విద్యార్థినిలు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలని తెలిపారు.
అనంతరం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి శ్రీ డి కర్ణాకర్ గారు మాట్లాడుతూ నాటిన ప్రతి ఒక్క మొక్కను కాపాడే బాధ్యత ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమము ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి శ్రీ డి కరుణాకర్ గారి పర్యవేక్షణలో జరిగినది.
ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం శ్రీ డి రవీందర్,. శ్రీ.ఎస్ సదానందం, శ్రీమతి టి నిర్మలాదేవి, శ్రీ బి లక్ష్మయ్య, శ్రీ ఏ సంపత్, శ్రీమతి కే సరూప, శ్రీమతి ఎస్ కవిత, శ్రీమతి జి కవిత, శ్రీమతి ఆస్మాఫిర్దోస్, కుమారి ఓ రాణి, అధ్యాపకేతర బృందము జూనియర్ అసిస్టెంట్లు శ్రీమతి కె గీతాంజలి, శ్రీ ఎస్ రాములుమరియు రికార్డ్ అసిస్టెంట్ టి రమాదేవి మరియు విద్యార్థినిలు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మొదలగు వారు పాల్గొన్నారు
